Others

షకీలా.. ఖురేషీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్ హాట్ భామ సిల్క్ స్మిత జీవిత కథతో వచ్చిన డర్టీ పిక్చర్ ఎంత సంచలనమైందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అలాంటి మరో సంచలనానికి సన్నాహాలు వేగంగా సాగుతున్నాయి. ఇంతకూ ఆ రెండో సంచలనం ఎవరో తెలుసా? షకీలా. మలయాళం బి గ్రేడ్ సినిమాలతో స్టార్ హీరోలకే చెమటలు పట్టించిన హాట్ భామ షకీలా జీవితాన్ని తమిడి చూస్తే ఎన్నో ఆటుపోట్లు, విషాద ఘట్టాలు కనిపిస్తాయి. ఆ కష్టాలు, కన్నీళ్లను ఇప్పటికే షకీలా స్వయంగా జీవిత కథగా మలిచి సంచలనం రేపింది. ఇప్పుడు ఆ జీవిత కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు మలయాళ దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్. ఈ శృంగార తార జీవిత కథకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ వేగంగా జరుగుతోందట. ఈ సినిమాను కేవలం మలయాళంలోనే కాకుండా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. షకీలా పాత్రలో జీవించేందుకు సిద్ధమైన తార ఎవరో తెలుసా? బాలీవుడ్ హాట్‌హాట్ భామ హుమా ఖురేషీ. ప్రస్తుతం ఈ బ్యూటీ మలయాళంలో మమ్ముటి సరసన వైట్ సినిమాలో చేస్తుంది. తరువాత షకీలా జీవిత కథలో కనిపించనుందట. ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే మిగతా వివరాలు వెల్లడి కానున్నాయి. మరి ఈ సినిమా నిర్మాణం నుంచి విడుదల వరకూ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూద్దాం.