Others

రారండోయ్ రమణులారా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అబలలు అని అణిచేసి
అనాదిగా అన్యాయం చేసి
ఆడవారంటే
వంటింటి కుందేలని
నస్ర్తి స్వాతంత్య్ర మర్హత
మను శాస్త్రం అన్నదని
మహిళల మనోభావాలను
మచ్చికతో మగవారే తమకు
నచ్చినట్లు దెబ్బతీసి
మగవారి విజయం వెనుక
మగువలు దాగుంటారని
పొంగవేసి లొంగదీసి
కోరికతో కృంగదీసి
సంప్రదాయ సంకెళ్లను
సుదతిని బలి చేసి
పురుషాధిక్య పౌరుషాన్ని
ఇంకా ఎందుకు క్షమిస్తావు
ఇంకా ఎన్నాళ్లు
ఈ కన్నీళ్ల మోత
రారండోయ్ రమణులారా
ఆదిపరాశక్తులై
అపర కాళికా మాతలై
జాప్యమేల జాగేలా
గోప్యమేలా గోపికలారా
సమానత్వ సాధనలో
కలసి రండి
జాగృతికి మారుపేరులా
కదలి రండి
కలసి రండి
రమణులారా!

- ఎం. భానుమూర్తి