Others

ఆనవాళ్ల లోగిళ్లు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాకు నీవు నీకు నేను
చిన్న నాటి బాసలు
బతుకుబడిలో
కనుమరుగైనాయా
నాటి జ్ఞాపకాల దొంతర్లు
దులిపితే దొంతర్లుగా
నీ జ్ఞాపకాలే
నీ ఆత్మీయతానురాగాల ఝరులే
ప్రేమను పంచే నీ కనులు
కమనీయమైన ఊసులు చెప్తుంటే
కాలం కరిగిపోయింది
నిన్నటి సిరులు
నేటి గిరులుగా మారినా
రానున్న కాలంలో
మానవత్వపు సిరులు
కావాలని నీ పోకడలే
నా నడకలు కావాలని
ఆశిస్తూ
నీకోసం
నీ జ్ఞాపకాల మంజూషను
నీకే బహూకరిస్తున్నా
ఆ తటాపటాయింపెందుకు
నీ జ్ఞాపకాల మంజూషలో
నా ఆనవాళ్ల లోగిళ్లున్నాయిగా

- ప్రసన్నాంజలి