Others

మాకొద్దీ చదువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోటీ ప్రపంచంలో
పిల్లల మధ్య
ద్వేషం, అసూయలను
నూరిపోస్తున్నారు..

గారాబం మాటున
సంతానానికి
కష్టం, సర్దుబాటు
సహనం వంటి
గుణాలు తెలియకుండా
అలవకుండా పెంచుతున్నారు..

చదువులో
వైఫల్యాన్ని భరించలేని వారు
ఆత్మహత్య చేసుకుంటే
ప్రతిభావంతులు సైతం
పర్సెంటేజీ తగ్గిందని
ప్రాణాలు తీసుకోవడం
ఆందోళనకరం..
ప్రతి సంవత్సరం
లెక్కకురాని
విద్యాకుసుమాలు
నేల రాలుతున్నాయి
కుంగుబాటు
యాంగ్జయిటీ
ఒత్తిడి
తల్లిదండ్రుల సంకుచితధోరణి
ఉపాధ్యాయుల హేళనలు
తోటివారి ఈసడింపులు..

ప్రస్టేషన్‌ను
పంచుకోగలిగే
ఫ్రెండ్ లేక
కుటుంబ బంధాలను సైతం
కూల్చేస్తున్నాయి..

తరగతి గది ముందు
తరాల వారిని
తీర్చిదిద్దే వేదికలు కావాలి..

-ఉషశ్రీ తాల్క