Others

సత్వర జ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆడదే అమ్మ
యుగయుగాల ఘన చరిత్రలో
రాముడే దేవుడని
రామాయణమే ఆదర్శమనీ
ప్రవచనాల ఘోష మిన్నంటు తోంటే
రావణ మనో కాష్ఠం మండుతోనే ఉంది
కామంతో సౌందర్యాలు అందవిహీనమై
సత్యంతో సహా దహించుకుపోతున్నాయి
ఇష్టానిష్టాలతో సంబంధం లేని కోరిక
కరాళ నృత్యం చేస్తోంది
మాతృదేవో భవా అని
ఉపనిషత్తులు స్పష్టం చేస్తే
అమ్మా ఓ ఆడదే!
అని భాష్యం చెప్పే మనిషి
పురోగమిస్తున్నట్లా?
ప్రవచనాలు ఆచరణ రూపం దాల్చాలంటే
న్యాయదేవత గాంధారి వ్రతం వదలాలి
కొరడా ఝుళింపించాలి
ఆడదంటేనే అమ్మ
అన్న జ్ఞానం సత్వరం కలుగుతుంది

-వారణాసి వెంకట సూర్యకామేశ్వర రావు 9491171327