Others

ఆకాశవీధిలో.. అందాల జాబిలి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చూడ చక్కని జంట- కన్నుల పంట- ఎంచక్కా పాట పాడుతున్నారంటే ఎంత ముచ్చటగా ఉంటుందో. అక్కినేని, సావిత్రి ప్రేమపక్షుల్లాగా కువకువలాడుతూ ‘ఆకాశ వీధిలో అందాల జాబిలి’అని పాడుతుంటే, ఆహా అని అనిపించదా..? వీక్షకులకు తప్పక అనిపిస్తుంది. వీరికితోడు ఆదుర్తి సుబ్బారావుగారి దర్శకత్వం, డి.మధుసూదనరావుగారి నిర్మాణ పర్యవేక్షణ, శ్రీశ్రీగారి సాహిత్యం, మాస్టర్ వేణు సంగీతం- ఇంకా ప్రత్యేకించి చెప్పాల్నా- ఆ పాట చిత్రీకరణ అద్భుతంగా సాగి- మనల్ని తన్మయుల్ని చేస్తుంది.
‘‘వయ్యారి తారను జేరి ఉయ్యాలలూగెనే సయ్యాట లాడెనే’అంటూ ఒకసారి.. ‘జలతారు మేలి మబ్బు పరదాలు నేసి, తెరచాటు చేసి’.. ఎంత కమనీయంగా ఉందో పదప్రయోగం. ‘అందాల చందమామ దొంగాట లాడెనే, దోబూచు లాడెనే...’’
‘కలకాలం నేనే నీవని- పలు బాసలాడి చెలి చెంతచేరి... అందాల చందమామ అనురాగం చాటెనే నయగారం చేసెనే...’
ఇలాంటి వీనుల విందయిన పాటలు నేటితరం పిల్లలకు కూడా నచ్చుతున్నాయ. లేకపోతే మహానటి సినిమాని అంత క్లాసికల్ హిట్ ఎలా చేస్తారు.
అందుకే ఈ పాటంటే నాకు ఎంతో ఇష్టం. మా ఆవిడ వంట చేస్తుంటే నేను ఈ పాట వింటూ కాలక్షేపం చేస్తుంటాను.

- కొమ్మన వెంకట రమణారావు, నెల్లూరు