Others

మళ్లీ స్పీడ్ పెంచింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిల్కీ భామ తమన్నా మళ్లీ స్పీడ్ పెంచింది. భారీ అంచనాలు పెట్టుకున్న అభినేత్రి ఫ్లాప్ తరువాత ఈ భామకు అవకాశాలు తగ్గాయి. తెలుగులో కేవలం క్వీన్ సినిమా మాత్రమే చేస్తోంది. అటు తమిళంలో కూడా పరిస్థితి అలాగే వుంది. ఇక తమన్నా తాజాగా కళ్యాణ్‌రామ్‌తో చేసిన నా నువ్వే కూడా ఆశించిన స్థాయి సక్సెస్ అందుకోలేదు. అయినా సరే మిల్కీ భామ గ్లామర్ విషయంలో ఎప్పుడు టాప్ కాబట్టి ఈ అమ్మడికి మళ్లీ అవకాశాలు వస్తున్నాయి. తాజాగా తమిళ హీరో సూర్య సరసన ఛాన్స్ కొట్టేసింది. సూర్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో తమన్నా హీరోయిన్‌గా ఎంపికైందట. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కే ఈ సినిమా వచ్చే నెలలో మొదలుకానుంది. సూర్య-గౌతమ్ మీనన్ కాంబినేషన్‌లో ఇదివరకే రెండు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు హ్యాట్రిక్ సినిమాకోసం గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది.
*