AADIVAVRAM - Others

కలలే!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవి సమ్మర్ వెకేషన్స్.. మెడికల్ కాలేజి గర్ల్స్ అండ్ బాయ్స్ కాలేజీకి, పాఠాలకి ‘బై’ చెప్పేసి సిమ్లా టూర్ ప్లాన్ చేశారు. మొట్టమొదటగా సిమ్లా.. ఆ తర్వాత ఎక్సెట్రా.. ఎక్సెట్రా...
ఇది దాదాపు పదిరోజుల షెడ్యూల్..
ఎటు చూసినా ఎతె్తైన కొండలు.. లోతైన లోయలు - కొండలన్నీ గుబురుగా పెరిగిన చెట్లతో పచ్చరంగు పులుముకుంటే.. లోయలలోకి దూకే సెలయేళ్లు ఆ నయాగరాని తలపిస్తున్నాయి. పచ్చిక బయళ్ల పరుగులెట్టే లేళ్లని తలపునకు తెస్తున్నాయి, బస్సులో నుంచి గుంపులు గుంపులుగా దిగుతున్న బాయ్స్ అండ్ గర్ల్స్‌ని చూస్తుంటే. ఉత్సాహం ఉరకలు వేస్తోంది యువతీ యువకుల మనోరధాల్లో.
ఎంతో మనోహర సుందర దృశ్యాలు యువ హృదయాల స్వప్నాలకు తెర తీస్తున్నాయి. ఒకపక్క సుందర నందన వనారణ్యాలు కనులకు విందు చేస్తుంటే.. రెక్కలొచ్చి ఊహలన్ని విహంగ వీక్షణం చేస్తున్నాయి బైనాక్యులర్స్‌లో - స్మార్ట్ఫోన్లు క్లిక్‌మంటున్నాయి. ఇంకోపక్క మజ్నూలకు లైలా పాపల కనుపాపల విరిసే కాంతులు వెచ్చని తలపులతో వేడిని పుట్టిస్తున్నాయి. చల్లని వాతావరణాన్ని తరిమి తరిమి కొట్టేస్తున్నాయి. వెచ్చవెచ్చని రొమాంటిక్ ఫీలింగ్స్ కలిగించి ఉత్సాహపరుస్తున్నాయి, యువతని.
అందరూ గుంపులు గుంపులుగా, జట్టు జట్టుగా కొందరు చక్కటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూంటే, ఒంటరిగా.. ఎవరితోనూ కలవలేక.. ఏం చేయాలో తోచక ఒక్కత్తె ఆగిపోయిన అక్షయని ‘హాయ్.. అక్షయ.. హలో’ అంటూ సుకుమార్ వీణియ తీగెని సున్నితంగా మీటినట్లు.. మెల్లమెల్లగా శృతి చేసినట్లు ఎదవీణియ సవరించినట్లు.. ఎంతో మృదువుగా తన పక్కగా వచ్చి పలకరించాడు.
ముఖంలో చిరాకనిపించినా, అక్షయ తనని అలా చూస్తూండిపోయింది కొత్త సినిమా కటౌట్‌లా. గ్రహించాడు సుకుమార్. సుకుమార్ ఆ వాతావరణాన్ని, సుందర దృశ్యాలని తనతో షేర్ చేసుకుంటున్నాడు. ఆతని మాటల్లో ఏదో మధువు.. మత్తు ఉంది. అంతకు మించిన ఆకర్షణ ఆ కదిలే కళ్లల్లో దాగుంది.
అనుకోని పలకరింపునకు అక్షయ ఒంటరితనం రెక్కలొచ్చి గాలిలోకి ఎగిరిపోయి, వెనె్నల్లో జాబిల్లిలా విరిసి మురిసిపోతోంది.. అమ్మ చేతి గోరుముద్దలా కొత్త రుచులు చవి చూస్తోంది. బహుశా దానికి కారణం ఇలాంటి అనుభవం ఇంతకు మునుపెన్నడూ లేకపోవటం కావచ్చు. తను ఆ అవకాశం ఎవరికీ కల్పించకపోవడం కావచ్చు.. లేదా తనున్న ఏకాంతం కావచ్చు.
ఒక్కసారిగా తనిలా చొరవ తీసుకుని తనని ‘అక్షయ.. హలో’ అంటూ పలకరిస్తే తనకీ లోలోపల ముచ్చట్లు వరస కట్టాయి.. స్నేహం పెంచుకోవాలని, హృదయం పరవళ్లు తొక్కాయి. సుకుమార్ అక్కడితో ఆగిపోలేదు, ఉరికే జలపాతంలా ఏదేదో మాట్లాడేస్తున్నాడు. తన మాటల్లోని అక్షర అక్షరంలో లక్ష విరుపుల్ని వెతుకుతోంది అక్షయ. అక్షరం అక్షరం ప్రోదిచేసి తన స్పందన ప్రకటిస్తోంది అక్షయ. కళ్లని ఆల్చిప్పల్లా అటుఇటు కదుపుతూ, అతని వైపు చూసీ చూడనట్లు అభినయిస్తూ రెప్పలార్చి ఏమారుస్తోంది అక్షయ.
అక్షయ కళ్లను.. కళ్లల్లో కదిలే కదలికలను సున్నితంగా పరిశీలిస్తూ ఆ పరిసరాల సౌందర్యాలను స్ర్తి సౌందర్యంతో అభిమంత్రిస్తూ.. పరవశించి వీస్తూన్న గాలికి తలలాడిస్తున్న లతలను, లతల నూగుతున్న పూల గుత్తులను.. పూలు వెదజల్లే పుప్పొడి పరిమళాలను ఓ కవిలా వర్ణిస్తున్నాడు - కవితా గానం చేస్తున్నాడు.
చిగురుకొమ్మలా.. గుబురు రెమ్మలా
ఏ స్వరకోయిల కూయదు
కుహూకుహూ గీతికల
కులుకులమ్మ కలువ కన్నుల కనుల వెనె్నల
ఊచకుండునా సరాగాల ఊయల
సరిగమల మధురిమల మధుమతిలా
మదనుని సతిలా.. ఆ రతిలా..
వావ్.. అంటూ గంతులేసింది అక్షయ. సుకుమార్ కవితా గానానికి ఎంతో థ్రిల్ అయ్యింది. లోలోపల భావాల్ని ఆపలేక, అణచలేక అక్షయ పైకనేసింది.
ఈ సమయం ఇక్కడే, ఇలాగే ఆగిపోతే ఎంత బాగుండును..
జగతిని వున్నది మనమిద్దరమె అని చేతులు పట్టేసుకుని చెట్టునీడకై పరుగిడుతున్నట్టు చిటపట చినుకులు పడుతున్నట్టు.. చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా వున్నట్టు-
సిట్యుయేషన్‌కి కవి ఎంత బాగా వ్రాసినట్టు - చెప్పలేని ఆ హాయిని.. చెప్పలేనంటూనే ఎంత గొప్పగా చెప్పాడు - ‘హాట్సాఫ్ కవి’ అంటే సుకుమార్.. అప్లాజ్‌కి, అక్షయలో కలిగిన స్పందనకి హ్యాపీ ఫీలయ్యాడు.
ఎంతసేపటి నుండి అక్షయ కలగంటోందో.. కళ్లు తెరిచి చూస్తే ఏముంది అమ్మ తనని తట్టిలేపుతోంది తెల్లారిందని - యుద్ధానికి సిద్ధమవమని. మళ్లీ దినచర్య మొదలు పుస్తకాలు, కాలేజీకెళ్లడాలు.. ఇంటికి మళ్లడాలు.. ఇక ఎక్స్‌కర్షన్ లేదు, ఎంటర్‌టైన్‌మెంట్ లేదు - ఎంజాయ్‌మెంట్ లేదు - ఏదీ లేని బ్రతుకే చేదు.
నాన్నగారు బొమ్మరిల్లులో ప్రకాష్‌రాజ్ - కాకపోతే అక్కడ సిద్దార్థ్.. ఇక్కడ అక్షయ. తన ప్రపంచం ఇల్లే.. వేరే పరిచయాలు, సరదాలు ఇల్లే. ఇల్లాగయితే ఎల్లాగనిపించినా..
స్ర్తి.. న.. స్వాతంత్య్రం అంటారు నాన్నగారు - సరేసరే అంటుంటారు అమ్మగారు.
కాలేజీకి కార్లో వెళ్లడం.. లంచ్‌బాక్స్ మంగమ్మ తినిపించడం-
తనకి కాలేజీ ఓ డ్యూటీ అయితే, మంగమ్మకి తనని కాలేజీ నుండి ఇంటికి తేవడం డ్యూటీ. మంగమ్మ, డ్రైవర్.. ఇల్లు.. కాలేజీ తన ప్రపంచం.
చూశారుగా.. కోరుకున్నది కావాలనుకుంటే కలలు కనడమే దారి మరి అనుకుంటూ అక్షయ ఉద్యుక్తురాలయ్యింది దినకరుడిని స్వాగతిస్తున్న సరోజలా.

-ఆచార్య క్రిష్ణోదయ 7416888505