Others

కృత్రిమం-కృత్రిమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుడమిపై
పుట్టిన ప్రతి ప్రాణికి
ఆరోగ్యంతో ఆనందంగా
ఉండాలంటే
శుభ్రమైన గాలి, నీరు, ఆహారం
అవసరం....
- కృత్రిమ పాలు, వంట నూనెలు, బియ్యం, గ్రుడ్లు
... ఆహారం తిని
ఆసుపత్రులను
ఆరోగ్యవంతంగా
అధిక ధనవంతులుగా
చేస్తున్నం
- బియ్యంలో
ప్రొటీనులు, ఐరన్, జింక్
పోషకాలు తగ్గాయని
బాధపడుతున్నాం
- పోషకాలను జోడించే విధానం
ఆవిష్కరించబడుతుందేమో!
భవిష్యత్తులో..
- వేరుశెనగ, వెల్లుల్లి
అల్లం, ఆవాలు
పసుపు, పప్పుదినుసులకు
అదనపు విలువలు కలిపే
యంత్రాలు
అందుబాటులోకొస్తున్నాయి
- ప్రయోగశాలల్లో
కృత్రిమ మాంసం, ఆహారం,
చేపలు, రొయ్యలు
మానవునికి ఆహారంగా
రాబోవుతున్నాయి
భవిష్యత్తులో కలికాలం మంటే
ఇదేనేమో!
- అధిక దిగుబడితో
నష్టానికి అమ్ముకొనే
రోజు రాకూడదు రైతుకు..
అమ్ముడుపోని ధాన్యాన్ని
ఆహార పదార్థాలుగా మార్చే
యంత్రాలు రావాలి
ప్రతి పల్లెకి
అప్పుడే అందరికీ
అందుతుంది
సమతుల్య ఆహారం
ఆరోగ్యంగా దేశం ఉంటుంది

-ఉషశ్రీ తల్కా