Others

అమ్మ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవ మాసాలు మోసి... పురిటి నొప్పులు పడి బిగువన ఓర్చి... నన్ను కన్నా
మా అమ్మకు హృదయ పూర్వక నమస్కారాలు...
అమ్మంటే తెలపడానికి భాష చాలడం లేదు.
కానీ చెప్పాలన్న ఆశ ఆగడం లేదు.
నా ఏడుపు విని తను నిద్రమానుకొని
అమృత తుల్యమైన ప్రేమతో నన్ను లాలించేది.
నా ‘ఊహ’తెలిసినప్పటి నుంచి తాను అనారోగ్యముతో బాధపడుతూ నా యొక్క ఆలన పాలన చూస్తుంది కదూ...
వెనె్నలయని చూపించి గోరుముద్దులు తినిపించేది
ఆకలిలో నా కడుపు నింపి... తాను అలమటించేది.
నాన్నలా దండించి సోదరిలా ఏడిపించి
గురువులా విద్యాబుద్ధులు నేర్పించి...
ఓటమిలో ఓదార్చి గెలుపు తలుపు తెలిపింది.
తప్పటడుగులు మాన్పి నడక నేర్పి... నడవడిక మార్చి
తను చదువుకోలేకున్నా నన్ను చదివించి...
వ్యక్తిత్వాన్ని ఇచ్చి, వ్యక్తిగా తీర్చి..
చెడు గుణాలను తుంపి.. ఆత్మవిశ్వాసం నింపి..
నాలో అభ్యున్నతి కోరుకుని తనలో కోరికలు చంపుకొని
నిరంతరం తమ బిడ్డకోసం తపనపడేది అమ్మ...
నాకు మరో జన్మంటూ ఉంటే....
నీకు అమ్మగా పుట్టాలనుంది...
అమ్మ...

--కసిరెడ్డి హారిక