Others

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయణుడు ఉదహరించిన శ్లోకం కొద్ది మార్పులతో సాంబపురాణంలో కూడా కనిపిస్తోంది. దానిలో 20వ అధ్యాయంలో ఇరవయ్యవ శ్లోకం ఇలా వుంది.
యోజనానాం సహస్రే ద్వే ద్వే శతే ద్వే చ యోజనే
ఏకేన నిమిషార్ధేన దివి సూర్యః ప్రసర్పతి
(ఆకాశంలో సూర్యుడు అర్ధ నిమిషానికి 2202 యోజనాల వేగంతో సాగుతున్నాడ) అని.
ఈ లెక్కలో యోజనాల ప్రసక్తి వుంది. యోజనం అంటే పది మైళ్ళని కొందరు, ఎనిమిది మైళ్ళని కొందరు, తొమ్మిది మైళ్ళని కొందరూ చెబుతూ ఉన్నారు. ఇవన్నీ ఉజ్జాయింపు లెక్కలే! ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన గొబ్బూరు వేంకటానంద రాఘవరావుగారు మొదలైన పెద్దలు లోతుగా పరిశోధనలు చేసి, యోజనం అంటే తొమ్మిది మైళ్ళ 160 గజాలు అన్నారు. కర్ణాటకలోని కొందరు పండితులు ఇది తొమ్మిది మైళ్ళ 110 గజాలు అవుతుందన్నారు.
ఇక నిమిషం అనే పదం దగ్గర ఒక పొరపాటు అభిప్రాయం ప్రజల్లోకి వ్యాపించింది. నిమిషం అంటే ఇంగ్లీషు మినిట్ అని మొదట్లో ఎవరో సామాన్య పండితులు అనేశారు. అది తప్పని ఆ తర్వాత పరిశోధకులు గ్రహించారు. ఆ విషయంలో సరియైన నిష్కర్ష వుంది. భారతీయుల నిమిషము (నిమేషము) అనగా ఇంగ్లీషు వారి 16/75 సెకండ్లు.
ఈ లెక్కల ప్రకారం గొబ్బూరి వేంకటానంద రాఘవరావుగారి గణితంలో కాంతివేగం ఒక ఇంగ్లీషు సెకండుకు 1,87,670 మైళ్ళు వచ్చింది.
నాగపూరుకు చెందిన ‘్భరతీయ బౌద్ధిక సంపద’ వారి గణితం ప్రకారం ఇది 1,85,016.169 మైళ్ళు వచ్చింది. నవీన విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఈ కాంతి వేగం 1,86,282.397 మైళ్ళు వస్తోంది.
మనకు తెలిసిన యంత్రాల సహాయం ఏదీ లేని రోజుల్లో, భారతీయులు కాంతి వేగాన్ని ఇంత నిక్కచ్చిగా ఎలా నిర్ణయించగలిగారో అది మనకు అంతుపట్టని ఆశ్చర్యం!
ఈ విజ్ఞానం తరతరాలుగా మన దేశంలో సాంప్రదాయకంగా వస్తూనే వుందనటానికి మరో నిదర్శనం ఏమిటంటే, క్రీ.శ. పదకొండో శతాబ్దంలో మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన నన్నయ్య భట్టు ఆదిపర్వంలో తపతీ సంవరణోపాఖ్యాన సందర్భంలో ఈ కాంతివేగాన్ని ప్రస్తావించాడు. ఆ తరువాత క్రీ.శ. 14-15 శతాబ్దాల ప్రాంతంలోని శ్రీనాథ మహాకవి, మల్లికార్జున భట్టు కూడా ఈ వేగాన్ని ప్రస్తావించారు.
ఇలా తరతరాలుగా అవిచ్ఛిన్న సంప్రదాయంగా వస్తున్న భారతీయ గణిత విధానాల లోతులు మనకు అర్థం కావాలంటే, వాళ్ళు కాలాన్నీ, దేశాన్నీ కొలిచిన కొలమానాల వివరాలు కూడా తెలియడం అవసరం. ఈ విషయంలో శ్రీ గొబ్బూరివారు రచించిన నన్నయ్యభట్టు విజ్ఞాన నిరతి అనే గ్రంథంలో వారు ఇలా అన్నారు.
ద్రవ్యము దేశావరణమధ్య స్థితితము. దేశ కాలములు అవినాభావ సంబంధము కలవి. ద్రవ్య లేశము పరమాణువైనపుడు కాలలేశము కూడా పరమాణువే యగుట న్యాయము. ఈ న్యాయమును బాటించి కాల తత్త్వవేత్త, తత్త్వవేత్త, మైత్రేయుడు, కాలలేశమును గూడా పరమాణువనియే వ్యవహరించినాడు.
భారతీయుల నిమేషము 1 = ఇంగ్లీషు వారి 1 సెకండులో 16/75 అంశ.
నిమిషార్థము = 16/75న1/8 = 8/75
నిమిషార్థములో వెలుగు 2202 యోజనములు బోవును. యోజనమునకు క్రోసులు నాలుగు; క్రోసునకు 2000 బారలు. బారలకు దండ అని గూడా పేరు గలదు. (=లైట్ ఆఫ్ ఆసియా, ఎడ్విన్ ఆర్నాల్డ్) బార = దండ - 2 ఇంగ్లీషు గజములు = 6 అడుగులు.
రెండు మైళ్ళు ఒక క్రోసని తప్పు అభిప్రాయము మనవారి నావేశించింది. రెండు మైళ్ళు అనగా 2న1760=3520 గజములు మాత్రమే అవుతుంది. క్రోసు 2000 బారలు (దండలు) 4000 గజములు. రెండు మైళ్ళు క్రోసు కంటే 480 గజములు తక్కువవుతాయి.
యోజనము = 4 క్రోసులు = 4న4000 = 16000
అనగా 9 మైళ్ళ 160 గజములు
(9న1760+160 = 16000)
2 పరమాణువుల కాలము- 1 అణుకాలము (పరమాణువుల సంఖ్య 2)
3 అణువుల కాలము- 1 త్రసరేణు కాలము ( ఇందు కాల పరమాణువుల సంఖ్య 6)
3 త్రసరేణువుల కాలము- 1 త్రుటికాలము ’’3న=18
100 త్రుటుల కాలము- 1 వేద కాలము ’’100న18 = 1800
3 వేధల కాలము- 1 లవ కాలము ’’3 న 1800 = 5400
3 లవముల కాలము- 1 నిమేషము కాలము (ఇందు 3న5400=16200 పరమాణువుల కాలము గలదు)
ఇంకావుంది...
*
‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.
*
ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004. ఆం.ప్ర. 0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి