Others

సృష్టి అంతా శక్తిమయమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృష్టిలో ఖాళి ప్రదేశమనేది లేదు. మొత్తమంతా శక్తితో నిండి వుంది. అమెరికాకు చెందిన శాస్తవ్రేత్త జాన్ ఎఫ్ వీలర్ అనే ఆయన విశ్వాన్ని గురించి ఏమన్నాడంటే ‘మనం శూన్యమని అనుకునేదంతా అత్యంత భయంకరమైన భౌతిక శాస్త్రానికి నిలయం-యథార్థమే కదా! సత్యమేమంటే, విశ్వంలో (సృష్టిలో) ప్రతి అణువులోను, ప్రతిమూలా నిరంతరం ఏదో ఒక మార్పు జరుగుతూనే వుంది. అంటే చైతన్యం స్పందిస్తోంది, నర్తిస్తోంది. అదే నటరాజ నృత్యం. ‘ఫ్రిట్జ్ ఆఫ్ కాప్రా’ అనే వైజ్ఞానికుడు, భారతీయ పురాణాలు చెప్పిన శివతాండవం అంటే నటరాజ నృత్యమిదేనన్నాడు (ది కాస్మిక్ డాన్స్ ఆఫ్ లార్డ్ శివ). ఆయన చెప్పిన సంకేతార్థ వర్ణన అత్యద్భుతంగా వుంది చూడండి. ‘‘నటరాజు కుడి చేతిలోని డమరుకం నూతన అణువుల సృష్టికి సంకేతం, ఎడమ చేతిలోని అగ్ని శిఖ, పాత అణువుల ప్రళయానికి సంకేతం. మరొక కుడి చేతితో అభయ ముద్ర చూపిస్తున్నాడు. మరియొక ఎడమ చేతితో వరముద్ర నెపంతో తన పాదాలనాశ్రయించమని చెబుతున్నాడు (సూచిస్తున్నాడ). ఇదీ నటరాజ మూర్తిని గురించి ‘ఫ్రిట్జ్’ చేసిన సంకేతార్థ వర్ణన ‘ది టాపో ఆఫ్ ఫిజిక్స్’ అనే తన గ్రంథానికి మొదటి ముద్రణ ముఖ చిత్రంగా, నటరాజ శివుడిని స్వీకరించాడు. ఈ గ్రంథం కోటీ ఇరవై లక్షల ప్రతులు అమ్ముడయ్యాయి. భారతీయ వేదాంత శాస్త్రాలు పురాణాలలోని అనేక విషయాలు పాశ్చాత్య శాస్తవ్రేత్తలకు, ఎన్నో కిటుకులను, సంకేతాలను అందిస్తుంటే మనం వాటిని పుక్కిటి పురాణాలుగా కొట్టిపారేస్తున్నాం అంటే ఎంతటి దౌర్భాగం. ఈ స్థితికి మనని మనమే నిందించుకోవాలి.
చైతన్యం: సాధారణంగా జీవుల యొక్క సంకల్పంవల్ల ప్రయత్నంవల్ల బుద్ధివల్ల సంబంధిత పనులు జరుగుతున్నాయని శాస్తజ్ఞ్రులంతా అంగీకరిస్తున్నారు. పనులన్నీ ఆ విధంగా జరిగేటట్లయితే మనం గాఢ నిద్రలో వున్నప్పుడు, మన శ్వాసక్రియ రక్తప్రసరణ వంటి క్రియలన్నీ ఎవరి సంకల్పం వల్ల ప్రయత్నంవల్ల జరుగుతున్నాయి. మన శరీరమంతా ఒక ఏకీకృ చైతన్య వ్యవస్థ. మన అరికాలుకు ఆదేశమివ్వాలంటే మన మస్తిష్కం నుండి ఫోన్ కాల్ చెయ్యక్కరలేదు కదా! ఒక అవిభామైన విశ్వవ్యాప్త చైతన్యం ప్రతి జీవిలోను, అన్ని వస్తువులలోను పనిచేస్తోంది. ఈ విషయమై ష్రోడింగ్ అనే పరిశోధకుడు పరిశోధనలు జరిపాడు. చివరకు ఆయన చెప్పిందేమంటే, భారతీయ ఉపనిషత్తుల ఆధారంగా విశ్వవ్యాప్తమైన చైతన్య శక్తివల్లనే సమస్త క్రియలు జరుగుతున్నాయని తెలుసుకున్నట్లు ప్రకటించాడు. తన సైన్సు పరిశోధనల ఆధారంగా ష్రోడింగర్ ప్రస్తుత విజ్ఞాన శాస్త్రంలోని సమస్యలకు పరిష్కార మార్గంగా ఒక ఈక్వేషన్ ప్రతిపాదించాడు. అదేమిటంటే, జీవాత్మ = పరబ్రహ్మ అని తేల్చాడు. ష్రోడింగర్ ప్రకారం సంఖ్యాపరంగా చైతన్యం ఒక్కటే, అనేక చైతన్యాలు లేవు. చైతన్యంలో ప్రకటితవౌతున్న బహుత్వం మాయ మాత్రమేనని తేల్చాడు. సర్ జగదీష్ చంద్రబోసు అనే శాస్తవ్రేత్త చెప్పినట్లు, ఒక వృక్షంలోని కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పూలు, వేళ్ళు మొదలైన భాగాలన్నీ జీవము చైతన్యం కలిగి వున్నాయి. ప్రతి ఆకు, పువ్వూ బయటి ప్రచోదనలకు ప్రతిస్పందిస్తాయి. కాబట్టి ఆ వృక్షంలో వేల కొలది చైతన్యానాలున్నాయని అనలేము కదా! ఆ చెట్టు మొత్తం వ్యాపించి వున్న అఖండ చైతన్యమొక్కటే కదా! అదేవిధంగా జగత్తు కూడా!
మానవ శరీరంలో చైతన్యం వుండే స్థానమేది? అనే ప్రశ్న న్యూరోఫిజియోలజిస్టుల నెంతకాలంగో ఆలోచింపజేస్తోంది. ఈ అంశంపై 20 సంవత్సరాలు పరిశోధన చేసిన వైల్డర్ పెన్‌ఫీల్డ్ అనే విజ్ఞానశాస్తవ్రేత్త, చైతన్యమనేది మానవ మస్తిష్కంలో వుండే పదార్థం కాదని నిర్ణయించాడు. అంతేకాకుండా మనస్సు, మస్తిష్కము (మైండ్ అండ్ బ్రెయిన్) ఒకటి కాదని వివరించాడు. ఈ విషయాన్ని నోబుల్ బహుమతి విజేత అయిన జంతు శాస్తవ్రేత్త అయిన ‘జార్జివాల్డ్’ అనే ఆయనపై సిద్ధాతాన్ని పూర్తిగా బలపరచడమే కాక, ప్రాచ్య (్భరతీయ) వేదాంతమే తనకు మార్గం చూపించిందని చెప్పాడు. చైతన్యమనేది మానవ మస్తిష్కంలో కాక సర్వత్రా వ్యాపించి వుందని చెప్పాడు. అట్లాగా న్యూరో బయోలజిస్టు జాన్ ఎక్లెస్ అనే ఆయన ఇదే విషయంపై లోతుగా పరిశోధన చేసి, చైతన్యమనేది మానవ మస్తిష్కానికి అతీతమైన అంశంగా వుండి, మానవ మస్తిష్కం ద్వారా పనిచేస్తూంటుందని నిరూపించాడు.
‘‘పిపీలకాది బ్రహ్మపర్యంతం’ అన్నిటియందూ ఒకే చైతన్యం పరివ్యాప్తమై వున్నదని చెప్పే మన ఉపనిషత్తుల సిద్ధాంతానికి, ఇంతకన్నా వైజ్ఞానిక నిరూపణ ఇంకేం కావాలి?
‘‘ఓం ఈశావాస్యమిదగ్‌ం సర్వం యత్కించ జగత్వామ్ జగత్’’
(ఈ వ్యాసానికి ప్రొఫెసర్ కుప్పా వెంకట కృష్ణూర్తిగారి వ్యాసాలు మరియు భవాన్స్ జర్నల్ 1994 నవంబరులోని స్వామీజి తాత్మానందజీ, మరియు డా. ఆర్.చిదంబరంగార్ల వ్యాసాలు స్ఫూర్తినిచ్చాయి. వారికి కృతజ్ఞతలు.)

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9490947590