Others

వ్యభిచరింపకూడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట విన్నారు కదా! (యేసు) నేను మీతో చెప్పునదేమనగా ఒక స్ర్తిని మోహపు చూపులతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. -మత్తయి 5:27-28
స్ర్తిని మోహపు చూపుతో చూచుట.. పుస్తకాల్లో కావచ్చు. మొబైల్ ఫోన్‌లో లేక వాల్‌పోస్టర్లలో లేదా సినిమాల్లో లేక టీవీలలో లేక ఏ విధంగానైనా కావచ్చు మోహపు చూపుతో చూచినట్లయితే అప్పుడే తన హృదయమందు వ్యభిచరించిన వాడగునని యేసు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. దీనినిబట్టి మోహపు చూపు చాలా అపాయకరమని తెలుస్తున్నది. ఈ చూపులకు వావివరస లేదు, చిన్న పెద్ద తేడా తెలియదు. ఇది కూడా రహస్య పాపము.
హృదయ రహస్యములు ఎరిగిన యేసు ప్రభువు మన చూపు వెనుక ఉన్న రహస్య తలంపులు కూడా పాపమేనని తెలియజేస్తున్నాడు. నేటి మోహపు చూపు రేపు హీనమైన కార్యము కావచ్చు. అలాగే మోహపు చూపులకు తావిచ్చే అలంకరణ, అరకొర దుస్తులు వేసుకొనే వారికి కూడా ఈ పాపం వర్తిస్తుంది. దీనిని సరిచేసికొనకపోతే దేవుని తీర్పు ఖాయం. నరకాగ్ని తప్పదు. ఈ రహస్య పాపములో చాలామంది ఉన్నారు. కాని స్వనీతి వల్ల భ్రమలో పడి -మోహపు చూపులు తప్పుకాదు, పాపము కాదు, వ్యభిచరిస్తేనే తప్పు అనుకుంటూ మోసపోతున్నారు.
మోహపు చూపు పాపము. ఈ పాపము నరకానికి గురిచేస్తుంది. అసలు ఈ మోహాన్ని పెంచి పెద్దచేసే హృదయం చాలా కీలకమైనది. యిర్మియా 17:9లో చెప్పబడినట్లుగా - హృదయము అన్నిటికంటె మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి. దాని గ్రహింపగల ప్రభువు ఇస్తున్న సలహా. మత్తయి 5:29 నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచిన యెడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. కుడికన్ను లేకపోతే ఎడమ కంటితో మోహిస్తారు. రెండూ లేకపోతే హృదయపు ఆలోచనలలోని ఊహలలో పాపము చేస్తాడు. అయితే ప్రభువు ఉద్దేశం కంటిని పెరికివేయమని కాదు. మోహపు ఆలోచన తీసివేయమని. కన్ను ఎంత విలువైనదో మనకు తెలుసు. ఏమిచ్చినా ఎంత ఇచ్చినా కన్ను తిరిగి రాదు కనుక - కంటిని అభ్యంతరపరచే వాటిని తీసిపారవేయాలి లేక మూసి పారవేయాలి.
అది టీవీ కావచ్చు. లేక మొబైల్ ఫోన్.. చూడకూడని సినిమాలు కావచ్చు. ఆటపాటలు లేక పోర్నోగ్రఫీ.. ఇంకా ఏవైనా కావచ్చు. వాటిని తీసిపారవేయాలి.
2 పేతురు 2:14 - వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనస్సులను మరులు కొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును, శాపగ్రస్తులు.
1 థెస్స 4:5 - మీలో ప్రతివాడు, దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందుకాక, పరిశుద్ధత యందును, ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము.
మోసపు ఆలోచనలు - మోహపు ఆలోచనలు అన్ని ప్రభువుకు బాహాటమే. అంతరంగములో ఉన్న పాపాన్ని చూయించిన ప్రభువే ఆ పాపాన్ని తీసివేయగలడు.
నేను - నా శరీరము అనుకొంటారు గదా. శరీరము మంటి పాలౌతుంది. కాని నేను, అనే ఆత్మ ప్రభువు సన్నిధికి పోయినప్పుడు - నీవు చూసిన మోహపు చూపులు, ఆలోచనలు అన్ని ఆత్మస్వరూపుడైన ప్రభువు ఎదుట బాహాటమే కనుక తీర్పు తీర్చబడుతోంది. ఇప్పుడు కూడా మన హృదయపు తలంపులలోని ఊహలు, మోహపు చూపులు ప్రభువుకు బాహాటమే. కాని యేసు ప్రభువు పరిశుద్ధ రక్తం వాటిని తండ్రికి మరుగుపరచుట ద్వారా, ప్రభువు మన పక్షమున చేస్తున్న విజ్ఞాపమును బట్టి శిక్ష పడటం లేదు. కనుక రహస్య పాపము ‘ఓకె’ అనుకోకూడదు. అందుకే ఈ మాటలు వ్రాయించాడు ప్రభువు. ఒక దినము రాబోతోంది. అప్పుడు ప్రభువే తీర్పరిగా కూర్చుని తీర్పు తీర్చేటప్పుడు, మనలను కాపాడేవారు ఎవరూ ఉండరు కనుక, కీర్తనకారుడు దావీదు మహారాజు చేసిన ప్రార్థన మనము చేయాలి. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము - కీర్తన 51:10.
ప్రభువు పరిశుద్ధుడు గనుక మనమూ పరిశుద్ధత కలిగి ఉండాలని, జారత్వమునకు దూరముగా ఉండాలని, తద్వారా దేవుని కుమారులముగా, కుమార్తెలముగా ఆయన రాజ్య వారసులము అవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవునితో సహవాసము, ఆయన రాజ్యము, కలకాలముండేవి కనుక, క్షణికమైన ఈ మోహపు చూపులు మాని, శుద్ధ హృదయం కలిగి స్థిరమైన మనస్సుతో నిత్య రాజ్యానికి వారసులవుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి సహాయము చేయునుగాక.
*

-మద్దు పీటర్ 9490651256