Others

అభినందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సగటు మనిషి జీవితం
ఆశకు నిరాశలకు మధ్య సాగే ఊగిస లాంటి పయనం
నిరాశల తిమిరాలపై సమరాన్ని సలుపుతూ
ఆశల తీరాలని చేరలేక
ఎడారిలోని ఎండమావుల్లా.. అక్కడక్కడా కనిపించే
ఆశల పల్లకీలో విహరిస్తూ
మనుగడ సాగిస్తుంటే...
సగటు మనిషిని నైరాశ్యంలోకి నెట్టేస్తాయి ఎదురయ్యే ఓటమిలు!
సగటు మనిషికి జీవితమంటే.. నాడు జీవించడం..
నేడు జీవన్మరణాల పోరాటం
అంతులేని ఆశల ఆరాటం!
ప్రతి రంగం కార్పొరేట్ సంస్కృతిని సంతరించుకుంటున్న వేళ..
విద్య, వైద్యం, విజ్ఞానం, మనోవికాసం..
తేడా అంటూ లేకుండా అన్ని రంగాలు
సరికొత్త రూపాన్ని సంతరించుకుంటుంటే
మానవ జీవితాలని ప్రతి నిత్యం ప్రభావితం చేస్తున్న వేళ...
కావాలనుకోగానే దక్కేది ఏదీ ఉండదు
కష్టిస్తేనే ఫలితాలు ఉంటాయని
ఇంకా నమ్మేస్తూ..
ఆశయాల లోగిళ్లలోకి..
అనురాగాల అనుబంధాలని తట్టిలేపుతూ
రాబోయే రేపటి తరం.. ఉజ్వల భవిష్యత్ కోసం..
కష్టిస్తున్న సగటు తల్లిదండ్రులు!
*

-గొర్రెపాటి శ్రీను 9652832290