Others

సెల్ మోహనరాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజంగా అదీ.. అరచేతిలోని అద్భుతం
భూమినీ.. భువనాంతరాల్ని
బొంగరంలా తిప్పుతున్న గొప్ప చోదకం
కళల ప్రపంచాన్ని
కళ్ల ముందు గిరికీలు కొట్టిస్తూ
స్క్రీన్ టచ్ చేశాక
కితకితల వెల్లువై ప్రవహిస్తుంది

ఇరుకుగాతోచే విశాల జగాన్ని
సౌకర్యంగా మార్చేస్తూ
మీటల మెట్ల మీదుగా వేళ్లు కదిలించాక
నౌకర్లతోనూ పనిలేదు చాకర్లతోనూ పనిలేదు
కిరాయి కార్లూ కరెంటు బిల్లులూ
మొబైల్ రీచార్జ్‌లూ డిజిటల్ కొనుగోళ్లూ
నగదు బదిలీలూ నచ్చిన వస్తువులూ
ఏవైనా సరే ‘్ఫన్ పే’లుగానో ‘్ఫ్లప్ కార్డు’లుగానో
‘పేటియమ్’లుగానో ‘వోయల్లెక్స్’లుగానో
నిమిషాల లెక్కన కాలాన్ని గాల్లో ఎగరేస్తుంది

మనిషి బతకడానికి
మరో మనిషి అవసరాన్ని నిరశిస్తూ
వేలజనాల సమూహంలోనూ
ఒంటరితనానికి తుంటరి వేదికౌతుంది
సంఘ జీవనానికి సహచరులు అక్కర్లేదనిపించే
కొత్తనెచ్చెలిగా
ఒక్కోసారి ఒంటరి సమయాలకి
సువిశాల జగతిని తోడిస్తుంది
బంధాల్నీ.. అనుబంధాల్నీ
తునాతునకలు చేసి
రంగుల తూనీగై లోకాన్ని వెలిగిస్తూ
వరల్డ్ వైడ్ వెబ్‌సైట్ మీదకి
ఓ వాలుచూపు విసిరేస్తూ మానవాళిని
లో.. బాటరీ తీరాల వరకూ పాకిస్తుంది

సెల్ మోహనరాగాల వీణియ మీద
ఎన్ని కప్పదాట్లేసినా
చివరికి మనిషి చేతిలో కీలుబొమ్మే
మునివేళ్ల మీద ముజ్జగాల్నీ
ఆడిస్తున్న మనిషే ఎప్పటికీ ఓ అద్భుతం
కాకపోతే..
ఎదుటి మనిషిలోని అద్భుతాల్ని
చూడలేని కబోదై
తరాలుగా కదులుతున్నాడు పాపం.
*

-బంగార్రాజు కంఠ 8500350464