Others

చిత్తం మార్చే చిత్రం--2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రాకృతమూలం
డి అరస్స అసుద్ధ మనస్స కులవహూణి అఅకుడ్డలిహి ఆఇం!
ది అహం కహేఇ రామాణులగ్గ సోమిత్తి చరి ఆ ఇం!! (హాలుడు)
సంస్కృత ఛాయ
దేవరస్యా శుద్ధ మనసః కులవధూర్నిజ కుడ్య లిఖితాని
దివసం కథయతి రామానులగ్న సౌమిత్రి చరితాని!!
తెలుగు
అదో ఉమ్మడి కుటుంబం. అత్తమామలు, భర్త ఇంట లేరు. పెళ్లికాని మరిది ఒక్కడే తోడుగా ఉన్నాడు. అతని చూపులు అదోరకంగా ఉండి ఆమెను ఇబ్బంది పెడుతున్నాయి. ఏమన్నా ప్రమాదం జరుగుతుందేమోనని మనసు కీడు శంకిస్తోంది. అప్పుడా ఇల్లాలు ఏం చేసిందో చూడండి.
ఆ.వె మరది కళ్ళలోని, మదనతాపము జూచి
వచ్చుసేగితోచి, వదిన అనియె
రాముననుగమించు లక్ష్మణు చిత్రంబు
చూడుమయ్య! ఎంత సుందరంబో!
-ఆమె ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ‘గోడమీద వున్న సీతారామ లక్ష్మణుల చిత్రం చూడు- ఎంత అందంగా ఉందో! లక్ష్మణుడు చూడు- రాముణ్ణి ఎలా అనుసరిస్తున్నాడో! సీతమ్మను తల్లిలా ఎలా పూజిస్తున్నాడో!’’ అని అంది. నేను నీకు తల్లిలాంటిదాన్ని అని సున్నితంగా మరదికి బుద్ధి చెప్పిన గాథ ఇది.

--డి.వి.ఎం. సత్యనారాయణ 9885846969