Others

రామ్‌చరణ్ బాలీవుడ్ సినిమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ రంగస్థలంతో తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు. నాన్ బాహుబలి రికార్డ్స్‌కింద రంగస్థలం మొదటి స్థానంలో నిలబడింది. ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్న చరణ్ ఆ తరువాత కొరటాల శివతో మరో సినిమాకు సన్నాహాలు చేస్తున్నాడు. అయితే చరణ్ ఫోకస్ ఇప్పుడు ఒక్క తెలుగులోనే కాకుండా.. హిందీపై కూడా పడ్డట్టుంది. ఇదివరకే హిందీలో జంజీర్ (తెలుగులో తుఫాన్) చిత్రంలో నటించాడు. ఆ సినిమా తీవ్ర నిరాశను మిగిల్చింది. అయితే తనకు హిందీలో సినిమాలు చేయాలన్న ఆశ ఉంది అని.. మంచి అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని అంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చరణ్ మాట్లాడుతూ.. మొదటిసారి హిందీలో జంజీర్ సినిమాకోసం చాలా కష్టపడ్డాము.. కానీ అది ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు.. అయినాసరే మంచి అవకాశం వస్తే తానూ హిందీలో చేయడానికి ఎప్పుడూ రెడీ అని చెప్పాడు. పైగా తనకు ప్రియాంకా చోప్రాతో కలిసి మరోసారి నటించాలని ఉందని చెప్పేసాడు. చరణ్‌తో కలిసి ప్రియాంకా జంజీర్‌లో నటించిన విషయం తెలిసిందే. మొత్తానికి రామ్‌చరణ్ బాలీవుడ్ డ్రీమ్స్ వర్కవుట్ అవుతాయేమో చూడాలి.