Others

ఏప్రిల్ 5న వస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు నటించిన ‘్భరత్ అనే నేను’ ఘన విజయం తరువాత తాజాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయనున్నారు. తెలుగు నూతన సంవత్సరం ఉగాది కానుకగా ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ఇటీవల ప్రకటించారు. మహేష్ నటిస్తున్న 25వ చిత్రమిది. అందుకే దీన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఇందులో మహేష్ సరసన పూజాహెగ్డే కథానాయికగా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలకపాత్ర పోషిస్తున్నారు. రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలుస్తోంది. సినిమాలో మహేష్, అల్లరి నరేష్ స్నేహితులుగా కనిపిస్తారట. మహేష్ సంపన్నుడి పాత్రలో, రవి అనే పేద యువకుడి పాత్రలో నరేష్ కనిపిస్తారట. ఇటీవల సినిమా షూటింగ్ డెహ్రాడూన్‌లో ప్రారంభమైన విషయం విదితమే. మహేష్‌పై కాలేజ్ ఎపిసోడ్ సన్నివేశాలను అక్కడే చిత్రీకరించారు. ఈ షెడ్యూల్‌లో పూజాహెగ్డే, నరేష్‌తోపాటు పలువురు కీలక పాత్రధారులు పాల్గొన్నారు.