Others

గోప గోపీ విలాసహేల (ఆంధ్రగాథాలహరి-4)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రాకృతమూలం
చోరి అర అస ద్ధాలు ఇ మా పుత్తి బ్భమసు అంధ ఆరమ్మి
అహి అ అరం లక్ఖి జ్జసి తమ భరిఏ దీవసీ హవ్వ (బమ్హయంతుడు)

సంస్కృత ఛాయ
చౌర్య రత శ్రద్ధా శీలే మా పుత్రి భ్రమరాంధకారే
అధికతరం లక్ష్యసే తమోభృతే దీపశిఖేవ!!

తెలుగు
బాలకృష్ణుని లీలా విలాసం ఈ గాథలో వర్ణించబడింది. ఇందులో గొప్ప విశేషమేమిటంటే- నాయకుణ్ణి నల్లనివాడని మాత్రమే సూచించాడు గాథాకారుడు. ప్రసిద్ధమైన నల్లవాడు శ్రీకృష్ణుడే కదా! ఇంకా ఈ గాథా సప్తశతిలోని 2వ శతకంలో 12వ గాథ ప్రత్యక్షంగా శ్రీకృష్ణుణ్ణే ప్రస్తావిస్తుంది కూడా!

ఆ.వె ‘‘నల్లవాడు వాడు, తెల్లని వెలుగీవు
కలసి రాత్రివేళ, మెలగుచుండ
జనులకనుల కెపుడు,
కనుపింపడాతండు అల్లరౌదువీవె!’’
అనియె గోపి
-‘‘అసలే కృష్ణుడు నల్లనివాడు. నీవు మెరుపుతీగలా తెల్లగా ఉంటావు. ఇద్దరూ కలిసి రాత్రిపూట తిరగటం ఎవరు చూచినా, నీవే కనిపిస్తావు కానీ, వాడు చీకట్లో కలసిపోయి కనపడడు. అందువల్ల నీవే అల్లరౌతావు. కాబట్టి ఆ చిలిపి గోపాలునితో జాగ్రత్తగా ఉండమని’’ ఒక గోపకాంత మరొక గోపికతో చెపుతోంది.
ఇందులో మరొక అర్థం కూడా కనబడుతుంది. పరమాత్మ ఎల్లప్పుడూ హృదయంలో ఉంటాడు. చైతన్యస్వరూపుడై వెలుగొందుతుంటాడు. అంతా తానై అయ కూడా వేరొకనిగా కనిపిస్తాడు. కాని తనకు తాను గా కనిపించడు. అంటే జగత్తే జగన్నాథుడు. కాని సామాన్యులకు జగత్తు జగత్తుగా కనిపిస్తుంది కాని జగన్నాథునిగా కనిపించదు. అట్లా గోపిక కనిపిస్తుంది. కాని గోపికలోని గోపాలుడు సామాన్య కంటికి కనిపించడు కదా. అందుకే కృష్ణయ్య చీకటిలో కలసిపోయ మిలమిలా మెరిసే గోపిక మాత్రం అందరికీ కనిపిస్తుంది.
- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ narayana d7@gmail.com