Others

మనోగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాశం చిల్లులు పడ్డట్లుగా వర్షం కుండపోతగా కురుస్తూంది
ఈ భూతలమంతా వరదై పొంగిపారుతూ ఉంది
అసలే పాతమిద్దె .. పగుళ్లతో రంథ్రాలుపడి
కారీ కారీ , నాలాగే వృద్ధాప్యంతో కునారిల్లుతోంది
ఏమాటకామాటే చెప్పుకోవాలి
ఈ ఇల్లంటే నాకు ప్రాణం, ఇది మా అమ్మ ప్రేమ కానుక
ఈ ఇల్లే అమ్మ తర్వాత నాకు అమ్మ అయ్యింది
ఇక్కడే తారతమ్యాల విలువలు తెలుసుకున్నాను
జీవితమంటే ఏమిటో నేర్చుకున్నాను
గతించిన కాలప్రవాహపు జ్ఞాపకాల గురుతులను
నాతోపాటు నా ఇల్లు కూడా చవిచూసింది
చివరకు ప్రాణం పోతుందేమోన్న చివరిక్షణం వరకు
ఎనె్నన్నో పరిస్థితులు నన్ను భయపెడుతూ ఉంటే
అందరూ ఉండి ఎవరూలేక వెక్కి వెక్కి ఏడ్చే వేళలల్లో
ప్రేమగా నన్ను నిమిరింది నా ఇల్లే
నా బిడ్డల చదువు సంధ్యలు, పెళ్లిళ్లు, పేరంటాలు, ప్రసవాలు
రోగాలు, రొస్టులు, సంతోషాలు, విషాదాలు
అన్నింటికీ నా ఇల్లే మొదటి సోపానమైంది
ఈ ఇంటిని తట్టుకోలేని పరిస్థితుల్లో అమ్మాలనుకొన్నా
వేరే గత్యంతరం లేని నా దురదుష్టకరమైన దౌర్భాగ్యపు క్షణాలను
లెక్కపెట్టుతూనే అమ్మలేక తాకట్టు పెట్టినా
చివరకు కిందా మీదాపడి నా ఇంటిని నేనే విడిపించుకున్నాను
రెక్కలోచ్చి ఎదిగిన నాపిల్లల నుండి
అమ్మా! ఈ ఇల్లు అమ్మేసి వేరే ఇల్లు కొను
లేకుంటే ఇది బాడుగకు ఇచ్చేసి వేరే ఇంటిలో ఉండు...
అనే పదేపదే ఉచిత సలహాలిస్తుంటే
అడుగు అడుగునా అమ్మ ఆశీర్వాదం పరుచుకున్న ఇల్లు
కష్టంలో నష్టంలో సుఖంలో దుఃఖంలో భాగమైన ఇల్లు
వదులుకోవలనా
అందుకే అంటాను నేను నా పిల్లలతో
వజ్రాలతో పొదిగి, రత్నాల పుప్పొడులతో రంగరించి
పచ్చల తోరణాలతో కట్టిన పాలరాతి భవనాల్లో లేని సుఖశాంతులు
ఈ నా ఇంటిలోనే నాకు లభిస్తాయనీ...
మనుషులు నచ్చలేదని, ఇల్లు బాగలేదని ఎంత దూరం వెళ్లగలం
అమ్మ ఒడిలో దొరకని మమకారం మనశ్శాంతి ఇంకెక్కడ లభ్యమవుతుంది?
పనికిరానిదని, ముసలిదైపోయిందని పరులపాలు చేసి
నీదారిని నీవు పోతావా
ఇది ఎక్కడి న్యాయం ఎవరునేర్పిన సంస్కారం ఇది?
అడుగడుగునా దిగజారిపోతున్న మీ వ్యక్తిత్వాన్ని గూర్చి
విమర్శిస్తే ఏం బదులు చెబుతారు? పోగొట్టుకోడం తెలిసిన మీకు
రాబట్టుకోవడం చేతకాని మీ అసమర్థత గురించి చెబుతారా?
కాలగతిలో నా ఇల్లు కూలిపోయినా, శిథిలాలు మిగిలిపోయినా
ఆ శిథిలాల ప్రాకారపుటంచులను మృదువుగా స్పృశిస్తూ
నేనుంటాను వదిలిపోను
స్థిర నిశ్చయం చేసుకొన్నాను నేను వారితో అదే చెప్పాను .

-- కె.జి.దేవి, 9440230401