Others

సాధన, బోధనల సంగమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉపాధ్యాయులు విద్యార్థులకు సమాచారం, ఘటనలు చెబుతారు. అవగాహనతో విశే్లషిస్తారు. బోధనలోని గుజ్జును, సారాంశాన్ని తీస్తారు. సాధన బోధన కన్నా క్లిష్టమైనది. దీనిలో ప్రతి మెట్టులో కొత్త విషయాల్ని పిల్లలు గమనిస్తారు. అర్హత పెంచుకుంటారు. నేను ఉపాధ్యాయునిగా ఒకప్పుడు ఒక కాన్‌సెప్ట్‌ను చెప్పి ఆ భాగంలో 20 లెక్కల్ని చేయమని చెప్పేవాణ్ణి. కొందరు పిల్లలు మూడు, నాలుగు లెక్కలే చేసేవారు. నాకు కోపం వచ్చేది. ‘20 లెక్కలు చేయమంటే మూడు లెక్కలే చేస్తావా?’ అని ఓ విద్యార్థిని అడిగాను. 20 లెక్కల్లో ఉన్నదంతా ఈ 3 లెక్కల్లో కనిపిస్తుందని విద్యార్థి సమాధానం. అంటే విద్యార్థి ఆ లెక్కల్లో సారాంశాన్ని పట్టుకున్నాడు. విద్యార్థి ప్రశ్నల్లో ఉన్న ప్యాట్రన్‌ను గమనిస్తాడు. ఆ ప్యాట్రన్‌ను గమనించడమంటే యోగ్యత పెరగడంగా చూడాలి. బోధపడిన దాన్ని మననం చేసుకుని కొత్త జ్ఞానంతో విద్యార్థి కొత్త భాష్యం చెబుతాడు. సమాచారాన్ని బేరీజు వేస్తాడు. ఈ అంశాలే విద్యార్థి క్రియేటీవ్ థింకింగ్‌కు మూలం. ఉపాధ్యాయుడు పండును చూపిస్తే దానిలోని గుజ్జును విద్యార్థి తీసుకుంటాడు. బోధన కన్నా క్లిష్టమైన మార్గంలో జ్ఞానపులోతుల్లోకి విద్యార్థి వెళతాడు. సాధనతో సాధించేవాడే విద్యార్థి. బోధించేవాడు ఉపాధ్యాయుడు. ఈ రెండింటి సంయోగంతో జ్ఞానమనే వెలుగును విద్యార్థులు దర్శిస్తారు. బోధన, సాధనల్లో ఏది గొప్పది అంటే- విత్తుగొప్పదా? చెట్టు గొప్పదా? అని ప్రశ్నించడమే. సాధన, బోధనల సంగమమే తరగతి గది సందేశం.

-చుక్కా రామయ్య