Others

ధైర్యస్థైర్యాలే సోపానాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి కాలంలో విద్య ఒక వ్యాపారంగా మారింది అనేవారు ఎక్కువ. ఇది నిజమే కావచ్చు. కాని, ఈ విద్యారంగంలో చదువుకున్న నేటి యువత చదువుకునేటపుడే ఏ చదువు చదివితే ఏ ఉద్యోగం చేయవచ్చో ముందుగానే తెలుసుకుని మరీ చదువుకుంటున్నారు. కాని ఇది జీవితం. అనుకొన్నట్టుగా అన్నీ జరగవు. అట్లాంటప్పుడు అనుకొన్న చదువు పూర్తి చేసినా, ఒకవేళ ఏ కారణం వల్లనో చదువు మధ్యలో ఆగిపోయి ఉద్యోగం చేయాల్సి వచ్చినా ఆందోళన పడేవారు ఎక్కువగానే కనిపిస్తున్నారు.
అనుకొన్న ఉద్యోగాలను సంపాదించడం కూడా ఒక కళే. ఏ విద్య చదువుకున్నామో దానికి సంబంధించిన ఉద్యోగం రావడం అదృష్టం. ఒకవేళ ఏ కారణం వల్లనైనా అనుకొన్న ఉద్యోగం రాకపోతే దిగులుపడకుండా మరో ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాలి. ఏరంగంలో లభించిన ఉద్యోగానికి ఆ సంస్థవారు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్‌ను మనసు పెట్టి నేర్చుకోవాలి. తెలియకపోతే అడిగి మరీ తెలుసుకోవాలి. కొత్త ఉద్యోగానికి వెళ్లేటపుడు ఉద్యోగానికి వెళ్లేవారు వారిని గురించిన సమాచారాన్ని పూర్తిగా, స్పష్టంగాను సంస్థ యజమానులకు ఇవ్వాలి. రెజ్యూమ్ ఇచ్చేటపుడే యజమాన్యాలకు ఆ వ్యక్తి పై ఒక మంచి అభిప్రాయం కలిగేట్టుగా రెజ్యూమ్‌ను తయారు చేసుకోవాలి. అందరూ రెజ్యూమ్స్ ఇస్తారు. కాని వాటిల్లో కూడా నేర్చుకున్నవి, చదువుకున్నవి, అభిలాష ఉన్నవి, అభిరుచులు ఏమిటన్న వివరాలు ఇస్తూన్నపుడే ఈ ఉద్యోగార్థి వల్ల సంస్థకు మంచిలాభాలు కలుగుతాయన్న భావనను వారికి తెలిసేవిధంగా రెజ్యూమ్ తయారు చేయాలి.
ఇన్ని చేసినా ఒక్కోసారి ఉద్యోగం రాదు. అట్లాంటపుడు కూడా నిరుత్సాహపడకూడదు. ఎందుకంటే అందరూ పల్లకీ ఎక్కేవారే ఉంటే ఆ పల్లకీని మోసేవారు కూడా ఉండాలి కదా. అలా అనుకొని వెంటనే స్వయం ఉపాధిరంగాన్ని ఎంచుకోవాలి. అందులో స్వంతంగా ఏది చేయగలమో అంచనావేసుకోవాలి. ఇంతకుముందు స్వయం ఉపాధిరంగాన్ని ఎంచుకున్నవారి దగ్గరకు వెళ్లి వారి అనుభవాలను తెలుసుకోవాలి. ఇపుడు మార్కెటులో దేనికి డిమాండ్ ఉందో అవగాహనను పెంచుకోవాలి.
ఒకవేళ ఉద్యోగం వచ్చినా కూడా కొందరికి ఇంటి పరిస్థితులు అనుకూలించక వ్యాపారం చేయాల్సి రావచ్చు. అలాంటివారు కూడా ప్రభుత్వం కల్పించే సదుపాయాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. స్వయం ఉపాధిరంగాన్ని ఎంచుకునేటపుడు అనుభవజ్ఞుల అభిప్రాయాలను తెలుసుకొంటూ డిమాండ్ ఉన్న వస్తువు ఉత్పత్తినో లేక తయారైన వస్తువును వినియోగ దారునికి చేర్చడమో లేక అసలు సమాజంలో ఉన్న వారు దేన్ని ఆశిస్తున్నారో కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది. అపుడు వ్యాపారాన్ని ప్రారంభిస్తే తప్పక ఆ వ్యాపారం మూడు పువ్వులూ ఆరుకాయలుగా అభివృద్ధి చెందుతుంది.
దేనినైనా ధైర్యంగా స్థైర్యంగా చేయగలము అన్న భరోసాతో మొదలుపెడితే చాలు విజయం మీ సొంతం అవుతుంది.

--మానస