AADIVAVRAM - Others

వెలుగుపూలు వికసించే శే్వత ఎడారి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ పుడమిపై ఎన్నో వింతలున్నాయి. తరచి చూస్తే అవన్నీ మనల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతాయి. అటువంటి వింతల్లో ఒకటి కన్నులు మిరుమిట్లు గొలిపే ‘శే్వత ఎడారి’. గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్‌లో కనిపించే ఈ ఎడారి సాధారణంగా కనిపించే ఇసుకతో కాకుండా తెల్లగా మెరిసిపోయే శే్వతవర్ణం కలిగిన ఇసుకతో నిండి ఉంటుంది. ఈ ఎడారిని చూసేందుకు ఏటా పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు. ఈ ఎడారి ప్రస్తావన రుగ్వేద కాలంలోను, మహాభారత కాలంలోనూ ఉంది. అలాగే అలెగ్జాండర్ ప్రస్తావన సందర్భంలో కూడా ఈ శే్వత ఎడారి గురించి చర్చ జరగడాన్ని మనం గమనిస్తాం. దీనినే ఆంగ్లేయులు ‘వైట్ సాల్ట్ డిజర్ట్’ అని కూడా అంటారు.
ఇక్కడి వాతావరణం ఇతర ప్రాంతాల కంటే ఎంతో భిన్నంగా ఉంటుంది. వేసవిలో ఇక్కడ 49.5 డిగ్రీల వేడి కుతకుత ఉడికించేస్తుంది. అలాగే శీతాకాలంలో అయితే ఏకంగా సున్నా డిగ్రీలకు పడిపోతుంది. అయితే ఆ సమయంలోనే ఈ శే్వత ఎడారిని వీక్షించాలని, ఆ సమయంలోనే ఇక్కడి అందాలు రెట్టింపు అవుతాయని టూరిస్టులు చెబుతుంటారు. ఇక్కడ ఏటా గుజరాత్ ప్రభుత్వం రాన్ ఉత్సవ్ పేరిట ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తుంది. ఆ ఉత్సవ ఛాయలు నాలుగు నెలల పాటు అంటే డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు కొనసాగుతాయి. ఆ సమయంలో ఈ శే్వత ఎడారి నిండిపోయేలా ఎక్కడ చూసినా టెంట్లే కనిపిస్తాయి. ధనవంతులు, విలాసవంతులు ఇక్కడ టెంట్లను అద్దెకి తీసుకుని వేడుకల్లో పాల్గొంటారు. ఆ సమయంలో ఇక్కడ ప్రతిరోజూ ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తారు. కళాకారులు తమ కళానైపుణ్యంతో ఆహూతులను అలరిస్తారు. ఆ సమయంలో ఈ శే్వత ఎడారిని చూస్తే ‘సిటీ ఆఫ్ టెంట్స్’ అనిపించేలా ఉంటుందని టూరిస్టులు అంటారు. దేశంలోని ఎక్కడెక్కడి నుండో వచ్చే కళాకారులు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసి తమతమ ఉత్పత్తులను విక్రయిస్తారు. రాన్ ఉత్సవ్‌కు ప్రత్యేక ఆకర్షణ ఒంటెల పోటీలు. ఇవి ఎంతో ఉత్సుకతను కలిగిస్తాయి. ఒంటెలపై సవారీ చేసి అవి వేగంగా దూసుకుపోతూ ఉంటే ఒకపక్క భయం, మరోపక్క ఆనందంతో టూరిస్టులు పెట్టే కేకలు ఇక్కడ ప్రత్యేకంగా వినిపిస్తాయి. అలాగే ఇక్కడి కచీ ప్రజల సంస్కృతిని తెలిపే అనేక వంటకాలను కూడా రుచి చూడవచ్చు. ఇక్కడికి దగ్గరలోనే ఇండియా-పాకిస్తాన్ బోర్డర్ కూడా ఉంది. అలాగే ‘చిరుబత్తీ’గా పాపులర్ అయిన ఘోస్ట్‌లైట్స్ (దెయ్యపు వెలుగు వలయాలు)లను కూడా రాన్ ఆఫ్ కచ్‌లో చూడవచ్చు. ఈ వెలుగులు రాత్రి ఎనిమిది తర్వాత కనిపిస్తాయి. రంగులు మారే ఈ వెలుగుల గురించి ప్రస్ఫుటంగా తెలియదు. అందుకే వీటిని మిస్టరీ లైట్స్ అంటారు. ఈ విధంగా అనేక వింతలతో నిండిన రాన్ ఆఫ్ కచ్ లేదా ‘శే్వత ఎడారి’ని వీక్షించడం ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని టూరిస్టులు చెబుతుంటారు.

- దుర్గాప్రసాద్ సర్కార్