Others

యంగ్ హీరో సరసన? (టాలీటాక్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల భామ కాజల్‌కు ఈమధ్య బాగా సినిమాలు తగ్గాయి. వరుసగా స్టార్ హీరోలతో జోడీకట్టి టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన కాజల్‌కు ఈమధ్య వరుసగా పరాజయాలు పలకరించడంతో ఈమెకు కొత్త అవకాశాలు తగ్గాయి. అటు తమిళంలోనూ పరిస్థితి అలాగే మారడంతో ఇపుడు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నాల్లో వుంది. తాజాగా శూర్పణఖ పేరుతో తెరకెక్కే ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్న కాజల్ తాజాగా కుర్ర హీరో సరసన నటించేందుకు ఓకె చెప్పింది. ఇంతకీ ఆ కుర్ర హీరో ఎవరో తెలుసా, విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి సినిమాలతో స్టార్ ఇమేజ్ అందుకున్న విజయ్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ప్రస్తుతం టాక్సీవాలా, గీత గోవిందం చిత్రాల్లో నటిస్తున్న ఆయన తదుపరి క్రాంతిమాధవ్ దర్శకత్వంలో నటించేందుకు ఓకె చెప్పాడు. సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ సరసన కాజల్‌ను ఎంపిక చేశారుట! ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్‌పైకి రానుంది. ప్రస్తుతం కాజల్ కూడా వస్తున్న అవకాశాలకు నో చెప్పకుండా మళ్లీ తన హవా ప్రూవ్ చేయాలనే ఆలోచనలో వుంది.

-శ్రీనివాస్ ఆర్.రావ్