Others

నేనంటే నేనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పురివిప్పిన చిరుజ్ఞాపకం
మనసు పొరల్ని-
ఆర్ద్రంగా తడిమినా-
తిరిగి రాని ఆ వసంతం
కలలా కరిగిపోయింది!
నవ్వుల నావలా సాగిపోయిన
యవ్వన జవ్వని - నేడు
జవసత్త్వాలు కోల్పోయి
మోహనరాగాలు పలికించలేక
మోడువారిన తరువులా మిగిలాయి!
సుమధుర సరాగాలను
శృతిచేసిన వలపు వీణ
కాలాన్ని జయించలేక
కన్నీటి పర్యంతమై మిగిలింది!
కనురెప్పల తీరాల్ని తాకిన
కలలు- వరదలై ఉప్పొంగి
కడకు కరడుగట్టి - బీడుబారి
కఠినమైన శిలలుగా మారాయి!
అమృతం వర్షమై కురిసిన
ఆ ఆత్మీయ జీవన లాలన
ఏమైపోయిందిప్పుడు?
ఏకాకిగా మిగిలిన నా గుండె చప్పుడు- ఈ
ఏకాంతాన్ని ఎలా భరించగలదు?
అడుగంటిపోయిన ఆకాంక్షలతో
కొడిగట్టిపోయిన కోరికల దీపకాంతితో-
ప్రేమ పిలుపు కోసం-
పరితపించిపోతున్న-
హృదయ స్పందనతో
చీకటి గదిలో - రేపటి వెలుగు కోసం
చిరు ఆశతో ఎదురుచూసే నేను-
ఆప్తులెందరున్నా - ఒంటరినే
ఆత్మీయులెందరున్నా - ఏకాకినే!
*

-మరువాడ భానుమూర్తి 8008567895