Others

నాగరికత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజాన్ని నిలువునా చీల్చి
అబద్దాలతో అడ్డంగా
అతికే నికృష్టులకు
నీరాజనమా ...
మంత్రాలకు మాయలకు తాయెత్తులకు
బురిడీ బాబాల ఎత్తులకు
ఇంకా బలమా?
నాగరికత పెరిగిందని
అందరికీ విద్య అందుతోందని
సంబరమా అది ఎక్కడ?
స్ర్తిలపై అరాచకాలకు
అడ్డుకట్ట వేసేదెవరు?
వృద్ధులపై, బాలలపై కూడా అఘాయిత్యాలకు
ఒడికట్టే వారిని కట్టడి చేసేవారెవరు?
నిజమైన నాగరికత
మంచి మనుగడ సాధ్యమయ్యేనా?

-రాజేశ్వరి బొమ్మిదేని 9160908045