Others

దృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏమిటో.. జీవితం ఆలస్యంగా ప్రారంభమయి
తొందరగా ముగుస్తుంది
పగలు మెల్లగా నడుస్తుంది
రాత్రి పరుగులు తీస్తుంది
ఎందుకో.. చెట్టు ఆకాశమెత్తు ఎదిగింది
ఆకు కదలటం లేదు
కొమ్మ నవ్వటంలేదు
అసలు చల్లగాలి చిగురించటంలేదు
ఏమిటో.. పసిపిల్లవాడు పగలు పూట ఏడుస్తున్నాడు
ఒక అందం ఒక గదిలో
రాత్రిపూట ఆత్మహత్య చేసుకుంది
నిన్నటి వరకు నక్షత్రం ఇవ్వాళ
ఎటో పోయింది
ఏమైంది.. ప్రతిదినం ఉదయంపూట వినిపించే కమ్మని గీతం
విషాద గీతంగా ఎందుకు మారింది
ఇంటి ముందు మల్లెచెట్టు
ఎందుకు పూల రాగాలు తీయటంలేదు
కంటి ముందు కమనీయ దృశ్యం
అకస్మాత్తుగా ఎందుకు రక్తం పులుముకుంది
నేనిపుడు
ఓడిపోయిన దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాను.

-సిహెచ్.మధు 9949486122