Others

శ్రీకృష ణతులాభారం ( నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత కాలంలో అధికంగా ప్రజాదరణ పొందిన నాటక రాజం ‘కృష్ణతులాభారం’. ఒకానొక కాలంలో ‘కృష్ణుడంటే రఘురామయ్య’ అనే నానుడి తెలుగు ప్రేక్షకులలో ఉండేది. అప్పట్లో ఈ నాటకం ప్రదర్శించినపుడు కృష్ణుడు ఒకవైపు కూర్చొన్నప్పుడు ఏవో బరువులు ఉన్నట్టుగా ఒక పెట్టెను రెండోవైపు ఉంచి తూగకపోవడంతో రుక్మిణి తులసిదళం వేయగానే కృష్ణుడు తటుక్కున లేచి నిలబడేవాడు. అప్పట్లో ఇప్పటిలా గ్రాఫిక్ ఫొటోగ్రఫీ ఉండేదికాదు. అయినా ఇసకవేస్తే రాలనంత జనం ఈ నాటకానికి వచ్చేవారు. దీనితోపాటు ‘సతీ సావిత్రి’ మరో దిగ్విజయంగా నడిచిన నాటకం. అప్పట్లో సుప్రసిద్ధ నటశేఖరుడు శ్రీ వేమూరి గగ్గయ్యగారు సావిత్రిలో యముడుగా, కృష్ణతులాభారంలో కంసుడుగా నటించి మెప్పించారు.
వర్తమానంలో ఇదే కథను సినిమాగా తీశారు. ఎన్.టి.రామారావు కృష్ణుడుగా, అంజలీదేవి రుక్మిణిగా, సత్యభామగా జమున, ప్రియవయస్యుడు వసంతకుడుగా రేలంగి నటించారు. గతంలో ఈ పాత్రను వంగర వెంకటసుబ్బయ్య నిర్వహించారు. ‘మీరు జాలగలదా నాయానత వ్రతవిధాన మహిమన్ సత్యాపతి’అన్న పాట పాతదే అయినా ఈ చిత్రంలోకూడా ప్రవేశపెట్టారు. కృష్ణుని నారదుడు బజారులో అమ్ముతూ పాడిన ‘బలే మంచి చౌకబేరము, సమయమున్ మించినన్ దొరుకదు, సుజనులారా’ అనే పాట కృష్ణుని అమ్ముతుండగా యాదవుల ‘కొట్టండి’ (నారదుని)అనే పాట ప్రజారంజకం అయ్యాయి.
అందచందాలతో భర్తను అనుపాజ్ఞలో పెట్టుకోవాలని చేసే ప్రయత్నం వృథా ప్రయాస అని, ప్రేమలోకూడా భక్తిని మించినది మరొకటి లేదని తేల్చి చెప్పిన చిత్రరాజం ‘కృష్ణతులాభారం’.

-కాకుటూరి సుబ్రహ్మణ్యం