ఆంధ్ర గాథాలహరి

అలకలకులుకులు-12

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
అలి అప సుత్త అ విణిమీలి అచ్ఛ దే సుహ అ! మజ్ఘ ఓ ఆసం!
గండ పరి ఉంవణా పుల ఇ అంగం ణ పుణే చిర ఇస్సం (చంద్రస్వామి)

సంస్కృత ఛాయ

అలీక ప్రసుప్తక వినిమీలి తాక్షహే సుభగ! మమావకాశమ్
గండపరిచుంబనాపులకి తాంగం న పునశ్చరయిష్యామి
దొంగనిద్దురింక చాలు
తే.గీ ఆలసించినకతమున, అలిగిన సతి
బుగ్గపై, ప్రేమతో సతి ముద్దిడంగ
పులకలాతని మేనిపై పొడమజూచి
‘చాలునిక దొంగ నిద్దుర’ జరుగమనియె
ఆమె ఆలస్యంగా పడకగదిని చేరింది. మగడు నిద్రలో వున్నట్టు గమనించి అతని బుగ్గపై ఒక ముద్దును ముద్రించింది. అతని మేనిపై పులకలు రావడం గమనించినఆమె అతనిది దొంగ నిద్దురని గ్రహించి’’ ఇక ముందు ఇలా జరగదులే! దొంగ నిద్దుర చాలించి జరిగి నాక్కొంచెం చోటివ్వు’’ అని గారంగా అడిగింది. భార్యాభర్తల అలకలు, ఆగ్రహారాలు పడకగది బయటే ఉండాలని నిర్దేశిస్తుందీ గాథ. అన్యోన్యదాంపత్యం ఇందులోవర్ణితం . అలకలు చిలికి చిలికి గాలి వానలు కాకుండా మూడో మనిషి ప్రమేయం లేకుండా భార్యాభర్తలు ఒకరికొకరు ఎలా ఒద్దికగా ఉండాలో తెలుపుతుందీ గాధ.

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949