నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసింహ శతకం
*
సీ॥ నీ కథల్ చెవులలో సోకుట మొదలుగా
పులకాంకురము మేనఁ బుట్టువాఁడు
నయమైన నీ దివ్యనామకీర్తనలోన
మగ్నుఁడై దేహంబు మరచువాఁడు
ఫాలంబుతో నీదు పాదయుగ్మమునకుఁ
బ్రేమతో దండ మర్పించువాఁడు
హా పుండరీకాక్ష! హా రామ! హరి! యంచు
వేడ్కతోఁ గేకలు వేయువాఁడు
తే॥ చిత్తకమలంబునను నిన్ను జేర్చువాఁడు
నీదులోకంబు నందుండు నీరజాక్ష!
భూషణవికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
*
భావం: ఓ స్వామీ! నీ కథలు చెవిసోకగానే పులకరించేవాడు. నీ నామ సంకీర్తనలో మైమరచేవాడు, తలవంచి నీకు సాగిలపడేవాడు, ఓ పుండరీక నయన! ఓ రామ! ఓ హరి! అని బిగ్గరగ కేకలు వేసేవాడు. మనస్సులో నినే్న ఆరాధించేవాడు నీ లోకాన్ని చేరుకుంటాడు (ముక్తి నొందుతాడు)