Others

ఆకలి తీర్చలేని యాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓసారి బలరామ కృష్ణులు ఆవులు మేపడానికి వెళ్లారు. పచ్చిక కోసం చాలా దూరం తిరిగారు. లేత పచ్చిక ఉన్న చోట ఆవులను వదిలి వారు అక్కడున్న చిన్న చిన్న చెలమల దగ్గర కూర్చున్నారు. వేసవి ఎండ వేడిమి చాలా తీవ్రంగా ఉంది. దానికి తట్టుకోలేక బలరామకృష్ణులు ఓ వట వృక్షం నీడన మేను వాల్చారు. గోపబాలకులందరినకీ బడలికతో ఆకలి వేసింది. వారంతా బలరామకృష్ణులకు వారి ఆకలిని చెప్పారు.
మరేంఫర్లేదు. ఇక్కడికి దగ్గరలో కొందరు బ్రాహ్మణులు యాగం చేస్తున్నారు. యాగవేళ వారు దానాలు బాగా చేస్తారు. అడిగిన వారికి క్షుద్బాధతో ఉన్నవారికి ఎంతోప్రీతిగా భోజన సదుపాయాలు కల్గిస్తారు. కనుక మీరు వెళ్లి వారిని మేమిద్దరమూ కూడా ఇక్కడే ఉన్నాం. మా కందరికీ భోజనాలుపెట్టండని అడగండి. మేము చాలా అలసిపోయి ఉన్నామన్న సంగతి వారికి తెలియ చేయండి అని చెప్పి పంపారు. గోపబాలకులు పరుగుపరుగున వెళ్లి ఆ ఋత్విజులకు బలరామకృష్ణులు ఆకలితో ఉన్నారు. వారికి ఏదైనా ఆహారం ఇవ్వండి అనిఅడిగారు.
యాగం చేసే బ్రాహ్మణులు యజ్ఞపురుషుడిని కొలుస్తున్నారు. కానీ ఆ యజ్ఞపురుషుడే కృష్ణుని రూపంలో వచ్చి ఉన్నాడని తెలుసుకోలేకపోయారు. అందుకే ఆకలితో వచ్చిన గోపబాలకులను ఏవగించుకున్నారు. ఈయాగం పవిత్రంగా జరుగుతోంది. మీ లాంటి వాళ్లు ఇక్కడకు రాకూడదు. దూరంగా వెళ్లండి అని వారిని కసురుకున్నారు...
*
ఇంకావుంది...