Others

బురద మనసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనసు పొరలలోన చీకటి
అలుముకున్నపుడు
కిటికీ నుండి లోనికి రాని వెలుగు
ఏం చేస్తుంది?
ఏ పరమాత్మ ముందు దీపాన్ని వెలిగిస్తుంది
ఇల్లు, మనసు అంతా చీకటిగానే ఉంది
ఆత్మను వెలుగులా వుంచుకో అనే తత్వం
బాగానే వుంది కానీ-
కన్నీటితో దీపానె్నలా వెలిగించగలను
చెట్టు నీడలో చిరుగాలి సంగీతం
తనివితీరా నీరు పోసాను కానీ
నీడలో ముళ్లెందుకు మొలిశాయి
ఎవరిని ప్రశ్నించాలి?
నా కనులు కాపలాగానే వున్నాయి
కానీ
కన్నీటిలో ఇరుక్కుపోయాయి
సంక్షేమం, స్వర్ణం
వూరడింపు వూకదంపుడు
ఉపన్యాసాల మధ్య
మనసు బోల్తాపడిన మాట నిజం
ఓడిన మాట నిజం
ఎక్కడో కనిపిస్తున్న వెలుగుల కొరకు
పరుగులు తీసి తీసి
విసిగిపోయిన దుఃఖం
వరదగా మారటం మానుకుంది
నిర్వేదం ఒక పెద్ద దుఃఖం.
*

-సిహెచ్.మధు.. 9949486122