Others

కన్నులు రాసే కావ్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలను అనే్వషించే కన్నులు
పుటల వెంట పరుగులు తీస్తాయి
ఒక్కొక్క పుట మారుతుంటే
చిక్కుబడిపోయిన సంగతులన్నీ
ఒక్కొక్కటిగా విడిపోతాయి
అక్షరాలు విడిపోయినా
అర్థాలు విడిపోవు
అర్థాల మాటున దాగిన
పరమార్థాలు ఎక్కడికీ పోవు!
అసలు పదాలే జీవనదాలు
అవి బారులు తీరి రాకుంటే
ఆవిష్కరించేందుకు అంతా శూన్యమే
పదాల నదులు పరవళ్లు తొక్కుతుంటే
హృదయాలలో కావ్యాలు అల్లుకొంటాయి
కన్నులు ముద్రించే కమనీయ దృశ్యాలతో
కావ్యరచన పూర్తవుతుంది!
రమణీయత రాజ్యమేలుతుంది!
*

-డా.అయాచితం నటేశ్వరశర్మ.. 9940468557