Others

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1000 బి.సి ప్రాంతపు సుశ్రుతుడు వెంట్రుకలను నిలువుగా చీల్చగల కత్తులను తయారుచేయు విధానాలను, వివరంగా వర్ణించాడు.
నూనం మమాంగాన్యచరా దనార్యః శస్రె్తైస్సితైః ఛేత్స్యతి రాక్షసేంద్రః
తస్మిన్ననాగచ్చతి లోకనాథే గర్భస్థజంతో రివ శల్యకృంతః॥
తాత్పర్యము- ‘‘లోక రక్షకుడైన శ్రీరాముడు త్వరగా రాకపోయినట్లైతే, గర్భంలో ఉన్న శిశువు యొక్క అవయవాలను, శస్తవ్రైద్యుడు ముట్టకోకుండానే ముక్కలు చేసినట్లుగా, దుష్టుడైన రావణాసురుడు త్వరలోనే నా అవయవాలను కూడ ముక్కలు చేసి వేయగలడు.’’
దీన్నిబట్టి గర్భస్థ శిశువును అవసరమైనప్పుడు ముక్కలుగా ఖండించగల పరికరాలు, వాటిని వినియోగించగల శస్త్ర చికిత్స నిపుణులు కూడ ఆ రోజుల్లో ఉండేవారని ఖాయవౌతోంది.
ఈ విధంగా ఇప్పటికి మనకు దొరుకుతున్న కొద్దిపాటి పురాతన వైజ్ఞానిక గ్రంథాల పరిశీలన ద్వారా గమనించి చూస్తే, ఆనాటి లోహ విజ్ఞానం ఎంత విస్తృతంగా వుండేదో ఊహకందుతోంది. ఇక అలనాటి గ్రంథాలు సమగ్రంగా దొరికితే ఇంకెన్ని విషయాలు బైటికి వచ్చి వుండేవో కదా!
వృక్ష వ్యవసాయ శాస్తమ్రులు
అనాదిగా భారతదేశానికి వ్యవసాయమే వెనె్నముక. ప్రపంచ దేశాలన్నింటికన్నా ఎంతో ముందుగా వ్యవసాయ రంగంలో శాస్ర్తియమైన కృషి విధానాలను ప్రవేశపెట్టిన ఘనత కూడా భారతదేశానిదే. అందుకనే సాక్షాత్తుగా వేదాలలోనే అనేక చోట్ల కృషి విజ్ఞానానికి, వృక్ష సంపదకూ సంబంధించిన రకరకాల మంత్రాలు ప్రస్తావింపబడి ఉండుట మనకు కనిపిస్తుంది. ఆ మాటకొస్తే ఋగ్వేదంలోని అక్షసూక్తం పూర్తిగా కృషి విజ్ఞానాన్ని కీర్తించడానికే కేటాయించబడింది.
ఇక పంటల ప్రసక్తి వచ్చేసరికి నేలను దున్నటం, విత్తనాలు నాటడం, పంటల్ని కోయటం వంటి వ్యవసాయ ప్రక్రియలను కూడా అథర్వవేదం సూటిగా ప్రస్తావిస్తుంది. ఉదాహరణకు-
యునక్త సీరా వియుగా తనోతకృతే
యోనౌ వపతేహా బీజం విరాజః సృష్టిః సభరా
అసన్నో నేదీయ ఇత్ స్మృణ్యః పక్వమా యవన్
నాగళ్ళు కట్టండి, విత్తనాలు వెదజల్లండి, కంకులు బరువెక్కుగాక! కొడవళ్ళు పండిన యవలను కోసి మా సమీపానికి తీసుకువచ్చుగాక!
ఇక యజుర్వేద సంహిత పంటలను వ్యవసాయాధార పంటలుగానూ, వర్షాధార పంటలుగానూ విభజించి ప్రస్తావించింది.
‘ఓషధయశ్చ మే కృష్టపచ్యం చ మే అకృష్టపచ్యం చ మే
(నాకు దున్నిన పొలములందు పండిన ఓషధులున్నూ, దున్నకనే వర్షాధారముగా పండిన ఓషధులున్నూ లభించుగాక!)
అంతేగాదు, పై చమకాధ్యాయంలో రకరకాల పంటల పేర్లు కూడా సూటిగా ప్రస్తావించబడినాయి.
నాకు వరి, యవలు, మినములు, నువ్వులు, పెసలు, ఖల్వములు, గోధుమలు, సెనగలు, కొర్రలు, చిరువడ్లు, చామలు, నీవారధాన్యములు లభించుగాక)
పాడికీ పంటకీ అవినాభాన సంబంధం వుంది గనక రకరకాల పశువుల సహాయం పంటకు ఎంతో అవసరం గనక చమకాధ్యాయంలో పశువుల ప్రసక్తి కూడా వుంది.
‘క్షాచ మే, వశాచ మే, ఋషభశ్చ మే, వేహచ్చ మే, అనడ్వాంచ మే, ధేనుశ్చ మే
నాకు గొడ్డుటావు, ఎక్కువ వయస్సుగల ఎద్దు, ఈచుకపోయిన ఆ, బండిలాగే ఎద్దు, కొత్తగా ఈనిన ఆవు మొదలైనవి లభించుగాక!
ఈ మంత్రంలో పాడికి పనికిరాకపోయినా పంటలకు పనికివచ్చే పశువులను గురించి ప్రత్యేకించి ప్రస్తావించడం గమనార్హం.
యజుర్వేదంలోనే రుద్రాధ్యాయంలో వ్యవసాయ పనులు చేసేవారిని గూర్చిన ప్రశంస కూడా నమస్కార రూపంలో వుంది.
‘నమస్తక్షభ్యో రథకారేభ్యః..’
(వడ్రంగులకు, రథాలను, బళ్ళను తయారుచేసే కార్మికులకు నమస్కారము)
ఇక వేదానంతర భారతీయ పురాతన వైజ్ఞానిక సాహిత్యంలోకి వస్తే ఓషధులూ, వృక్షాలూ, వ్యవసాయము, మొదలైన వాటి ప్రస్తావన అనేక శాస్త్రాల్లోనూ పురాణాలలోనూ మనకు దర్శనమిస్తుంది. ఉదాహరణకు వైద్య శాస్త్ర గ్రంథమైన సుశ్రుత సంహితలో సూత్ర స్థానంలోనే (ప్రథమాధ్యాయంలోనే) వృక్షశాస్త్ర ప్రస్తావన వుంది. భారతంలోని భరద్వాజ భృగుమహర్షుల సంవాదంలో మరికొన్ని వివరాలున్నాయి.
ఆధునిక వృక్షశాస్త్రం వృక్షజలాన్ని రెండుగా వర్గీకరింది. కానీ సుశ్రుతంలో వృక్షజాలాన్ని నాలుగు వర్గాలుగా వర్గీకరించారు.
‘‘తాసాం స్థావరశ్చతుర్విధః వనస్పతయో వృక్షా వీరుధః ఓషధ్య ఇతి’’
తాసు అపుష్పాః ఫలవంతోవనస్పతయః
పుష్పఫలవంతో వృక్షాః ప్రతానవత్యః స్తంబినయశ్చ వీరుధః
ఫలపాకనిష్ఠా ఓషధయ- ఇతి!
వనస్పతి అంటే పూలు పూయకుండా ఫలాలను ఇచ్చేది. పూలతో పళ్ళను ఇచ్చేది వృక్షం! కాండం లేకుండా గుబురుగా అల్లుకుంటూ పెరిగేది వీరుధం!
పళ్ళు పండగానే ఎండిపోయేది ఓషధి!
*
ఇంకావుంది...
*
‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.
*
ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004. ఆం.ప్ర. 0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి