Others

చిరునామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎందుకైనా మంచిది
ఎందరిలో నువ్వున్నా
నవ్వులెన్ని పూయిస్తున్నా
అభద్రతలో పడిపోవడం
కాదు కాని.. నువ్వొక్కడివే
నిజంగా నువ్వొక్కడివే

ఎందరు నిన్ను ఎన్ని విధాలుగా
పొగడ్తల్లో ముంచెత్తినా
అందుకు కారణాలు
ఏవైనా.. ఎన్నున్నా
అపనమ్మకం కాదు కాని
పొగడ్తని నిజమనుకునే
అమాయకత్వం
పొందేదేమిటని..?

అందరూ నువ్వేదో
అరుదైన వ్యక్తిత్వమని
ఇంకొకటని మరొకటనడం
అతిశయోక్తి కాదు కాని
నిన్ననుసరించు వారు
ఎందరన్నది నిస్సందేహంగా
ప్రశ్నార్థకం.. నిలువెత్తు ప్రశ్నార్థకం!
ఆశ్చర్యార్థకాన్ని కలుపుకొని
కనిపించే ప్రశ్నార్థకం!!

భయాలు నినే్నదో చెయ్యాలనుకున్నా
నిందలు నిష్ఠూరాలు
గునపాలై గుచ్చుకోచూస్తున్నా
నిజం తానేమిటో వినిపిస్తుంది
ఎటు చూసినా కనిపిస్తుంది

నువ్వే ఒక
అక్షరాయుధమైనా
నువ్వే ఒక
చైతన్య గీతమైనా
నువ్వే ఒక
స్ఫూర్తిప్రదాతవైనా
నువ్వు మాత్రమే
నువ్వు ఒక్కడివి మాత్రమే
ప్రత్యేకతలెన్ని సంతరించుకున్నా
నువ్వెవరికన్న ఎక్కువా కాదు
మరొకరికన్న తక్కువా కాదు
మంచీ చెడుల మధ్య
వ్యత్యాసం విస్మరిస్తే
తప్పొప్పుల మధ్య
తేడాను దాచిపెడితే
సత్కీర్తి నిను చేరుకునే
దారుల చిరునామా
ఎక్కడ?.. ఎక్కడ..??
స్వరంలో మాధుర్యమవడం
హారంలో దారమవడం
చేతల్లో వుంటుంది తప్ప
నీ చేతుల్లో ఏముంటుందని?
*

-డా.కొల్లు రంగారావు 9866266740