Others

ఓటమిని ప్రేమిస్తూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓటమిని ప్రేమిస్తున్నా
నన్ను గెలిపించాలని చూడకండి
ఇప్పుడు ఓటమి నా శ్వాస
తన నుండి దూరమై ఒక్క నిమిషం కూడ
బతకలేని నిస్సహాయ స్థితి నాది
ఓటమిప్పుడు నా ప్రాణంలో ప్రాణం
గెలుపు కోసం వేసిన అడుగుల మడుగుల్లో
అడుగడుగునా ఓటమి ఓదార్చింది
అందినట్టే అంది చేజారిన గెలుపు రాపిడిలో
వరుసుకుపోయిన గాయాల సలపరింతలపై
ఏదో మాయాలేపనం పూసి
మనసును ఓలలాడించింది
ఇప్పుడు ఓటమి నా నుంచి
విడదీయలేని బంధం
బతుకు వయోజన విద్యాకేంద్రంలో
ఓనమాలు నేర్పుతున్న గురువు
ఓటమిప్పుడు జీవిత పాఠాలను
గుణపాఠాల మాద్యమంలోకి
తర్జుమా చేసి బోధిస్తున్న
ఓ విశ్వవిద్యాలయం
అదేదో సినిమాలో చెప్పినట్టు
గెలుపుదేముంది.. మహాయితే
నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది
ఒక్కసారి ఓడిపోయి చూడు
ప్రపంచం మీకు పరిచయవౌతోంది
అవును ప్రపంచం
ఇప్పుడిప్పుడే పరిచయవౌతోంది
కష్టం విలువను
క్షణాల లెక్కన కొలుచుకుంటున్నాను
ఓటమిప్పుడు దొంగిలించబడని
నా విలువైన సొత్తు
తన నుండి దూరం చేస్తూ
నన్ను గెలిపించాలని చూడకండి
ఓటమి నాతో విసుగు చెందేవరకు
మా ఇద్దరికీ బంధం తీరిపోయే వరకు
నన్ను గెలిపించాలని చూడకండి.
*

--బంగార్రాజు కంఠ.. 8500350464