Others

మకరందం తొడిగిన నీడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక మెత్తటి తెల్లని పొరలో
ఆలోచనలు పురుడు పోసుకుంటాయ
కొన్ని రక్తపు ఛాయలతో
ఎర్రటి సూర్యుడిలా
విప్లవాగ్నిని మండిస్తే
మరికొన్ని ఆలోచనల నౌకలు
జన్మించగానే అలల పొత్తిళ్లలోల
శాశ్వతంగా నిద్రిస్తాయ

జయంతో వర్ధంతో
తెలియని అయోమయంలో
అతను కన్నీటి బొట్టులో
అక్షరాన్ని కలిపి
అదే సముద్రంలో కలిపేశాడు

ఒకేసారి ఆలోచనలన్నీ
మేఘాల్లా
శరీరపు ఆకాశాన్ని
కమ్మేసినప్పుడు
మెదడు దర్వాజా నుండి
ఎండా... వాన
ఒకేసారి వర్షిస్తాయ

కరువొస్తుందో వరదొస్తుందో
మళ్లీ అదే అయోమయంలో
అతను మెదడుకు
పదాల కట్లు కట్టి
పచ్చని వాక్యాన్ని నాటాడు

ఇప్పుడక్కడ
కురుక్షేత్రం జరుగుతోంది
అతను దృఢంగా
ఎటువంటి అయోమయం లేకుండా
కవితను బరిలో నిలిపాడు

రణభూమిలో రుధిరం లేదు
మకరందం తొడిగిన నీడ
సమయాన్ని లెక్కచేయకుండా
కురుస్తూనే ఉంది

- అఖిలాశ, 07259511956