Others

టూర్ ఎంజాయ్ చేయండిలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటికాలంలో వారాంతపు సెలవురోజులను ఎక్కడికైనా వెళ్లి గడిపే ఆలోచన్లు పిల్లలే కాదు పెద్దలూ చేస్తున్నారు. వారంతం రెండు రోజులు బయటకు వెళ్లాలంటే కొంతమంది ఏమేమి తీసుకెళ్లాలో అని చిరాకు పడుతుంటారు. చిరాకు పరాకులు లేకుండా హుషారుగా వారాంతపు సెలవుదినాలను హాయిగా గడపాలంటే కొన్నిచిట్కాలు పాటిస్తే చాలు. ముందుగా ఎక్కడివెళ్తున్నామన్నది డిసైడ్ చేసుకొన్నాక దాన్నిబట్టి ఏ డ్రస్సులు వేసుకోవాలో నిర్ణయించుకోవాలి. ఒకవేళ చలి ఉన్నప్రదేశాలకు అయితే చలిని దూరం చేసే దుస్తులు, జలపాతాలకు లేక ఈతకొట్టే వీలున్న చోట వెళ్లితే వాటికి సరిపడే బికినీలు ల్లాంటివి, బాగా ఎండలున్న ప్రదేశాలకు అయితే నూలు బట్టలు ఇలా తీసుకోవాలి. ఆ తరువాత అక్కడున్న రోజుల్లో ఏమి తినాలి అన్న దాన్ని గురించి ఆలోచించాలి. పిల్లలకు, పెద్దలకుఅవసరమైనవి ఆరోగ్యాన్నిచ్చేవి తీసుకెళ్లాలి. వీటిల్లో బాదం, పిస్తా, వాల్‌నట్స్ ల్లాంటివి వెంట తీసుకొనివెళ్తే మంచిది. మీరు తీసుకెళ్లే బ్యాగులకు చక్రాలుంటే చాలా ఈజీగా ఉంటాయ. ఎక్కువ లగేజీలు కూడా తీసుకోకూడదు. పిల్లలు ఆడుకునే వస్తువులు ఒక్కబ్యాగ్‌లో సర్దుకుంటే పిల్లలు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మీటూర్ ఎంజాయ్ చేయవచ్చు.

--చివుకుల