Others

ఉపాధికి మార్గాలెన్నో ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉద్యోగినులు అయిన మహిళలు అటు ఉద్యోగం, ఇటు ఇంట్లో పని చేయలేక సతమతమవుతుంటారు. అటువంటివారు స్వయం ఉపాధి మార్గంలోకి వెళ్లుతున్నారు. మనకిష్టమొచ్చిన టైములో పనిచేయవచ్చు. మనం చేసిన పనికి తగ్గ ఫలితాన్ని పొందవచ్చు అనుకొంటూ ఈ స్వయం ఉపాధిమార్గంలో వస్తున్నారు. ఇందులో కూడా కొత్త పొంతలు తొక్కుతూ తాము మాత్రమే ఉపాధి ఆదాయాన్ని పొందే వీలు నుంచి నలుగురికి ఉపాధి కలిగించ గలిగే స్థాయికి మారుతున్నవారూ ఉన్నారు. వస్తువును తయారు చేసే శక్తి ఉన్నవారికి మార్కెటు గురించి అంత అవగాహన ఉండదు. మార్కెటు నిపుణులకు వస్తు తయారీలో నైపుణ్యం ఉండదు. రెండూ ఒకరి దగ్గరే ఉండవు., కాని ఇరు వర్గాల వారు ఒక్కరుగా మారవచ్చు. దానికి కాస్త నేర్పు కావాలి. అట్లా కాకపోతే వ్యాపారం ఒక్కరు చేయకుండా ఇద్దరు కలసి వ్యాపారం మొదలుపెడితే ఒక్కరు మార్కెటు అవసరాలను, మరొకరు వస్తు తయారీని చూసుకోవచ్చు. అపుడు తయారైన వస్తువును సరియైన దారిలో మార్కెటు చేసుకొని లాభాలను పొందవచ్చు. అపుడే డిమాండ్ సప్లై సూత్రాన్ని బాగా ఒంట బట్టించుకున్నట్టు అవుతుంది.
ఈ ఉపాధిరంగంలో నేడు ఎక్కువగా విస్తళ్ల తయారీ ఉంది. ఈ విస్తళ్ల తయారీలో కొత్త పుంతలు వస్తున్నాయి. రకరకాలు ఆకుల తయారీకి కావలసిన సామగ్రి మిషన్లు, పనిముట్లు సేకరించుకోవడం చాలా సులువుగా సాగుతుంది. వీటితోపాటుగా దగ్గర ఉన్నవారికి అరటిఆకులు, మర్రి ఆకులతో విస్తళ్లు అందించడమ మంచి వ్యాపారంగా మారుతోంది. మధ్యాహ్నం తీరికగా ఉన్నప్పుడు ఈ విస్తళ్ల తయారీని సాగించుకోవచ్చు. కాని ఈ విస్తళ్లవ్యాపారానే్న ఇంకాస్త పెంచుకుని ముందుకు వెళ్లాలంటే దీనికి తోడుగా అగరబత్తీల తయారీ కూడా మహిళలే చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. పైగా శ్రావణం, ఆశ్వీయుజం, కార్తికం ఇలా వచ్చే నెలలన్నీ కూడా పూజాదికాలు ఎక్కువగా చేసే కాలం. కనుక అగరబత్తీలకు మంచి గిరాకీ ఉంటుంది. కనుక అగరుబత్తీలను తయారు చేయడం వాటిని మార్కెటింగ్ చేసుకోవడం పట్ల మహిళలు ఆసక్తి చూపుతారు. ఈ అగరుబత్తీల వ్యాపారంలో అగరుబత్తీలకు డిమాండ్ ఫలానా అప్పుడే ఉంటుంది అని ఏమీ లేదు. భగవంతుడిని ఆరాధించడం ఆయనకు చేసే సేవల్లో ధూపంవేయడం అనేది నిత్యం సాగేది కనుక అగరుబత్తీలకు మంచి డిమాండ్ అన్ని కాలాల్లోను ఉంటుంది. కేవలం నలుగురితో ప్రారంభించిన ఈ వ్యాపారాన్ని 20 మంది మహిళలతో కూడా సాగించే వీలుంటుంది.
కొందరు ఈ అగరుబత్తీల్లోనే చాలా రకాలు తీసుకొని వస్తున్నారు. దీని గురించి శిక్షణను ఇచ్చే ప్రైవేటు సంస్థలున్నాయి. ప్రభుత్వ స్వయం ఉపాధి కార్యక్రమాల్లో కూడా అగరుబత్తీల శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ ఎంతో సులువుగా ఉండడంతో చాలామంది ఈ శిక్షణ తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు.ఈ స్వయంఉపాధిని పొందేవారికి బ్యాంకులు కూడా రుణాలు ఇస్తాయి.
మొక్కలు పెంపకాన్ని కూడా స్వయం ఉపాధిగా ఎంచుకోవచ్చు. ఇంట్లో పెంచుకోవడానికి ఆసక్తి చూపేవారికి ఈ మొక్కలను అందచేయవచ్చు. కుండీల్లో పెంచుకోవడానికి వీలుగా నారును ఏర్పాటు చేసుకోవడం, చిన్న చిన్న పూల మొక్కలను పెంచడం, వాటికి కావాల్సిన ఎరువులు, క్రిమిసంహారక మందుల పైన కొంత అవగాహనను కల్పించుకుని వాటిని మొక్కలతో పాటు ఇవ్వడం అలవాటు చేసుకొంటే మంచి గిరాకీ ఉంటుంది. ఇప్పుడిప్పుడు బాల్కనీల్లోను, టెర్రస్ పైన కూరగాయలు, పూలు పెంచడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అట్లాంటి వారికి మొక్కలను అందచేసే స్వయం ఉపాధి ని ఎంచుకుంటే లాభాలతో పాటుగా మానసిక సంతృప్తికూడా మిగులుతుంది. పర్యావరణానికి మీరు ప్రత్యేకంగా సేవ చేయకుండానే సేవ చేసినట్లు అవుతుంది.
అసలు ఒక్క ఐడియా జీవితానే్న మార్చివేసినట్లుగా ఉపాధిమార్గాన్ని ఎంచుకోవాలంటే అనేక దారులున్నాయి.
కర్రీ పాయింట్స్ కన్నా ఇపుడు కోరుకున్న ఆహారాన్ని కోరుకున్న వారికి అందించడంలోను ఉపాధిని ఏర్పరుచుకుంటున్నారు. కొన్ని అపార్ట్‌మెంట్స్‌తోను, కొన్ని సంస్థలతో అనుబంధాన్ని ఏర్పరుచుకుని అక్కడివారికి కావాల్సిన ఆహారాన్ని వారు కోరుకున్న హోటల్స్ నుంచి లేక వంటవారి దగ్గర నుంచి తయారు చేయించి వారికి అందివ్వడంలోకూడా మంచి ఉపాధిమార్గాలున్నాయి. ఈ భోజనం అందించే ఉపాధి నేడు విస్తృతంగా విరివిరిగా మారుతోంది. ఈ ఉపాధిని ఎంచుకోవడం సులువే కానీ దీనిలో లాభాలు ఆర్జించాలంటే మంచి మెలుకువలతోపాటుగా సమయపాలన చేయాల్సిఉంటుంది. కాలాన్ని అయిపోయిన కాలం తిరిగి రాదుకనుక ఏ సమయంలో ఏఅవసరం వస్తుందో దాన్ని గమనించి ఆ అవసరం తీర్చే మార్గాన్ని ఎంచుకోవడమే ఉపాధిగా మారుతుంది. అవసరమే అవకాశాన్ని అందిస్తుంది. ఆ అవకాశమే నలుగురిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. కనుక కాస్తంత ఆలోచన ఉంటే సమయం సద్వినియోగం చేయడంతోపాటుగా వ్యాపారలాభాలను ఆర్జించవచ్చు. ఏ వ్యాపారం చేసినా మార్కెంటింగ్ తెలుసుకోవాలి అంటే మార్కెంట్ నిపుణులు కావాలన్నమాట. లేకుంటే తయారైన సరుకును మార్కెట్ చేసుకోలేక పోతే నష్టాల బారిన పడుతారు. కనుక మార్కెట్ రంగం గురించి తెలిసిన వారితో మాట్లాడగలిగి తయారైన వస్తువు ఎంత అవసరమో వారికి వివరించగలగాలి.

- జి.కల్యాణి