Others

మళ్లీ రిజర్వేషన్ల చిచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశం స్వాతంత్య్రం పొందిన అనంతరం- ‘అనాదిగా ఆర్థిక, సామాజిక రంగాల్లో నిర్లక్ష్యానికి గురైన’ హరిజనులు, గిరిజనుల అభ్యున్నతి కోసం 10 ఏళ్ల కాలపరిమితితో రిజర్వేషన్ల చట్టాన్ని అప్పటి కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఆనాడు ప్రభుత్వోద్యోగుల జీతాలు సామాన్య పౌరుల ఆదాయం మాదిరిగానే వుండేవి గనుక ఏ వర్గం ప్రజలు వ్యతిరేకించలేదు. వ్యాపార, రైతు కుటుంబాల, చేతి వృత్తులవారికి ప్రభుత్వోద్యోగాలపై అప్పట్లో ధ్యాస లేదు. బంట్రోతు, పోలీసు కానిస్టేబుల్ వంటి ఉద్యోగాలు ఏడెనిమిది తరగతులు చదివినా లభించేవి. ఈనాడు జీతభత్యాలు, దేశ జనాభా, విద్యావంతుల సంఖ్య అనూహ్యంగా పెరిగాయి. పేదల నుండి ధనికుల వరకు అందరూ ప్రభుత్వోద్యోగాలు ఆశిస్తున్నారు.
మరోవైపు ‘మూలిగే నక్కపై తాటికాయ పడిన’ట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతూ పోతున్నాయి. ఫలితంగా నియామకాలు తగ్గి నిరుద్యోగ యువత నిరాశ, నిస్పృహలతో ఆందోళనకు దిగుతున్నారు. కొన్ని సామాజిక వర్గాల వత్తిడితో ప్రభుత్వాలు బీసీ, ఓబీసీ కులాలకూ క్రమంగా రిజర్వేషన్లు విస్తరించటంతో అది యాభయి శాతం కూడ దాటిపోతోంది. నానాటికీ పెరిగిపోతున్న కంప్యూటరీకరణతో ఉద్యోగావకాశాలు తగ్గిపోతున్నాయి. కుల, మత వర్గాల ‘రిజర్వేషన్ల పోరాటాలు’ వివిధ వర్గాల మధ్య విద్వేషాలు రేపుతున్నాయి. ఇదే అవకాశంగా సంఘ విద్రోహశక్తులు సమాజంలో విషబీజాలు నాటుతున్నాయి.
ఇక, ప్రస్తుత సామాజిక స్థితిగతులను పరిశీలిస్తే ఇప్పటివరకు అమలుచేసిన రిజర్వేషన్లు, వివిధ సంక్షేమ పథకాలు, ఐటీ విప్లవం వంటి వాటిద్వారా మన సమాజం కుల మతాలకతీతంగా ఆర్థికంగా ఎదుగుతోంది. రిజర్వేషన్లు పొంది అభివృద్ధి చెందిన కుటుంబాల వారు ఆ సౌకర్యం వదులుకొని అట్టడుగు స్థితిలోనున్న సాటివారికి అవకాశం ఇస్తే ఇంకా దేశం వృద్ధిచెందేది. నేడు వెనుకబడిన కులాల నేతలు సైతం సగర్వంగా తమ పేర్లచివర కులం పేరు చేర్చుకునే స్థితి వచ్చింది. అగ్ర కుల, వెనుకబడిన కులాల యువతీ యువకుల మధ్య కులాంతర, మతాంతర వివాహాలు జరుగుతున్నాయి. ఎక్కడో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కొంత కుల వివక్ష, అగ్రకులాల ఆధిపత్యం మిగిలి వుండవచ్చు. దానిని ఆర్థిక కోణంతో చూడాలి గాని కులాల మధ్య వైషమ్యం పెంచకూడదు. ఆ దురాచారం కాలానుగుణంగా తగ్గిపోతుంది. నేడు ధనికులు, నిరుపేదలు అన్ని కులాల్లోనూ ఉన్నారు గనుక కులమతాలకు అతీతంగా సమాజంలో అట్టడుగునవున్న నిరుపేదలకే అన్ని రకాల రిజర్వేషన్లు కల్పించాలి. అప్పుడే కులాలమధ్య విద్వేషాలు తగ్గుతాయి.
పెట్టుబడి లేని వ్యాపారంలా ప్రభుత్వోద్యోగమైతే చాలనుకొనే ఈ రోజుల్లో ఇంజనీర్లు, డాక్టర్లు, ఇతర కీలక ఉద్యోగాల్లో ప్రమోషన్లకు కనీస అర్హతలు, నైపుణ్యం వంటి వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. లేకుంటే ప్రభుత్వ సేవల్లో నాణ్యత లోపించి ప్రజానీకానికే నష్టం కలుగుతుంది. ఇప్పుడున్న రిజర్వేషన్లతోనే కులాల మధ్య విద్వేషాలు రేగుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటుచేస్తూ వందల కోట్ల రూపాయల నిధులు మంజూరుచేస్తున్నది. తగిన పర్యవేక్షణ లోపించడంతో ప్రభుత్వ నిధులు అనర్హులకు చేరుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. దేశ సమైక్యతను దెబ్బతీస్తున్న ఈ విషయంలో అన్ని రాజకీయ పక్ష నేతలు కుల, మతాలకతీతంగా దేశ శ్రేయస్సును దృష్టిలో పెట్టకుని రిజర్వేషన్లు నిరుపేదలకు మాత్రమే వర్తింపచేసే విధంగా కృషిచేయాలి. ఇక వేతన సవరణల సమయంలో ఉద్యోగ సంఘాలు జీతాలు పెంపుపైనే పట్టుబట్టకుండా సిబ్బంది పెంపుకోసం కూడ పోరాడితే లక్షలాది మంది నిరుద్యోగులకు, పేద కుటుంబాలకు మేలు చేసిన వారవుతారు.

-తిరుమలశెట్టి సాంబశివరావు 92478 70141