Others

ఇల్లు కొన్ని దృశ్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా చేతి వేళ్లు పట్టుకున్న
ఉదయంలా నవ్వుతూ
కాస్తంత ముందుకి
ఇల్లు పిల్లాడి అల్లరితో ఊగుతుంది.

తెరచిన కిటికీ అరల్లోంచి
చేతులు చాచుకు ఎగిరే గాలికి
గోడకి వేలాడే క్యాలెండర్లు
ఎగిరి ఎగిరి నవ్వుకుంటున్నాయి.

మూసిన హృదయాల్ని తెరిచే తలుపులు
కొద్దికొద్దిగా వీధి దృశ్యాల్ని
కూరగాయల బండిగానో నడిచిపోయే బాధ్యతలగానో
ఒంపుతున్నాయి.

సందర్శించిన ప్రదేశాలు
మాట పంచుకున్న అనుభవాలు
నాల్గు గోడల మధ్య
జ్ఞాపకాల ఆకుల్లా రాలుతున్నాయి.

ఒక మునిలా ధ్యానిస్తుంటే
ఆత్మ దర్శనంలో
జ్ఞాన సంద్రాలు ముంచుతున్నాయి.

ఆరబోసిన ఆకాశం కింద
పిల్లాడు బొంగరంలా తిరుగుతుంటే
చుక్కల ఆకాశం చొక్కాలో మెరుస్తోంది.

ఆరుబయట చినుకులు
బుగ్గల్ని గిల్లుతూ ముత్యాల్ని అద్దుతూ
తూనీగల్ని పైపై ఊపుతూ
మనోరథాన్ని మహిమాన్వితం చేస్తున్నాయి.

వౌన ప్రపంచాన్ని ముక్కలుచేసి
మాటల లోగిళ్లు
ముసి ముసి నవ్వులై కుదుపుతున్నాయి

ఉదయానికి సంధ్యకి మధ్య
చెరగని మధురానుభూతిలా. *

-గవిడి శ్రీనివాస్.. 9966550601