Others

వర్షం కురిసిన రాత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్షం కురిసిన ఆ కాళరాత్రి
ముళ్లకంపల పొదల మాటున నిన్ను విసిరి
పారేసి చేతులు దులుపుకుని పోయి రెవ్వరో!
ఆ హృదయం ఎంత పాషాణ సదృశ్యమో!
ముద్దుల మూటగట్టుమోము
పసిమొగ్గవు నీవు!
ఓ పసిపాప ఒకవేళ నీవీ విశ్వంలో
జీవించియున్న నీ భవిష్యత్తు ఎంత ఉజ్వలమై
ఉండెడిదో కదా అట్టి నీ జీవితాన్నివారి
స్వార్థం కోసమో లేక దరిద్రం కోసమో మరి
ఇక దేనికోసమో, నీ బ్రతుకును పైశాచికంగా
సమాధిని చేసిన ఆ దౌర్భాగ్యులు ఎంతటి
నీచులో కదా తరచి చూడగాన్
రక్తసిక్తమైన నీ శరీరంలో ముళ్లు గుచ్చుకుని
రక్తము ఏరులై పారుచుండా ఏమి జరిగినదో
తెలుసుకొనలేక వెక్కి వెక్కి ఏడ్చు నీ ఏడుపుకు
అవని గుండియలు ముక్కలైనా జాలిలేని
ఈ సభ్యసమాజ విషకోరలందు చిక్కి అశవులు
బాసితివా ఓ అభాగ్య ! అసహాయపు చిట్టితల్లీ!
అందాల సిరిమల్లీ! చూచెడివారి హృదయుల్
ద్రవింపగన్

- కె.జి. దేవి 9440230401