Others

ఉత్సాహంగా .. ఉల్లాసంగా....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంతమంది ఏ పని చేయాలన్నా కొంత నిరాసక్తంగా ఉంటారు. ఏదో నిరుత్సాహం కనిపిస్తూ ఉంటుంది. ఏంటో ఏమి చేయాలో నాకు అర్థం కావడం లేదు అంటుంటారు.
అబ్బా ఇప్పుడు చేయాలా అంటారు. ఇంట్లో ఉన్నవాళ్లు కాక మరో ఇద్దరు భోజనాలకు వస్తున్నారు అంటే ఎంతో బాధపడిపోతారు. అమ్మో ఇద్దరికి వంట చేయాలా అని ఎక్కడాలేని బాధ వ్యక్తం చేస్తుంటారు.
కొందరు ఆఫీసులో రోజూ చేసే పని అయినా వారు ఎంత పని చేస్తున్నానో నాకు చేతులునొప్పి వస్తున్నాయి. ఇంత పని నాకిచ్చారు అంటూ సణుగుతూ ఉంటారు. పక్కవారి చేత మాటలు చెప్పి పనులు వీరి చేయించుకుంటూ ఉంటారు. ఎక్కడలేని నొప్పులు,జబ్బులు ఇల్లాంటివి చెబుతుంటారు. అవతల వారు వీరు పని చేయడానికి సాకులు చూపిస్తున్నారు అని అనుకొనేలా ప్రవర్తిస్తుంటారు. ఇది మంచి పని కాదు. పనిని ఎంతో ఇష్టంగా చేస్తే ఆ పనిలో ఎంతో నైపుణ్యం వస్తుంది. అనుకొన్న పనిని బాగా చేసినపుడు నలుగురూ ఆ పనిని మెచ్చుకుంటారు. దానితో ఎంతో ఆనందం వస్తుంది. పని చేసేటపుడు అనుకోకుండానే మెలుకువలు కూడా తెలుస్తాయి. మరొకరు ఆ పనిచేసేటపుడు వారికి చేదోడు వాదోడుగా ఉండవచ్చు. సలహాలు ఇవ్వచ్చు. మీ సలహావారికి నచ్చితే మిమ్ములను ఆకాశానికెత్తినట్లు పొగడుతారు. పని చేసానన్న తృప్తికలుగుతుంది. ఈ తృప్తి ఎన్నివేల రూపాయలు పోసినా దొరకనిది. కనుక ఏ పనికైనా ‘నో’ అనకుండా ఇష్టపడి చేయడం అలవాటు చేసుకొంటే ఒకవేళ కష్టమైన పని వచ్చినా సునాయాసంగా చేసేస్తారు.
పెద్దపనులు వచ్చినపుడు ఒక ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం అనుకొన్న టైములో చేస్తూ పోతే అటు టైములో చేసినట్టు కూడా అవుతుంది. ఏపని చేసినా ప్రణాళికాబద్ధంగా చేస్తే మంచి ఫలితాలొస్తాయ.

- చివుకుల