Others

సూర్యతో వెంకటేష్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు వెంకటేష్. మహేష్‌తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తో ఈ మల్టీస్టారర్‌లకు పచ్చజెండా ఊపిన వెంకీ.. వరుసగా పలువురు హీరోలతో కలిసి మల్టీస్టారర్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వరుణ్‌తేజ్‌తో ఎఫ్-2 అనే మరో మల్టీస్టారర్‌లో నటిస్తున్న వెంకటేష్, తాజాగా మరో క్రేజీ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసాడు. అయితే ఈసారి ఆయన చేస్తున్నది ఎవరితో తెలుసా? తమిళ స్టార్ హీరో సూర్యతో! అవును.. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌లో ఓ మల్టీస్టారర్‌కి సన్నాహాలు జరుగుతున్నాయ. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారట. ఈ సినిమాలో వెంకటేష్‌తోపాటు హీరో సూర్య కూడా నటిస్తాడట. ఇప్పటికే సూర్యతో చర్చలు కూడా జరిపినట్టు తెలిసింది. అన్నట్టు ఈ సినిమాలో ఇద్దరు పోలీసు అధికారులుగా కనిపిస్తారని టాక్. మరి ఇలాంటి క్రేజీ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారన్నది తెలియాల్సి ఉంది. గతంలో కాక కాక్క అంటూ సూర్య చేసిన సినిమాను ఘర్షణ పేరుతో వెంకటేష్ రీమేక్ చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరూ పోలీసు పాత్రల్లో జనాలను ఆకట్టుకున్నారు. ఇపుడు వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో పవర్‌ఫుల్ పోలీసు అధికారులుగా కనిపిస్తారంటే.. ఇక థియేటర్స్‌లో ఒకటే హంగామా ఉంటుందేమో!

--శ్రీనివాస్ ఆర్.రావ్