Others

అడవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేనెప్పుడూ అడవిని చూళ్లేదు
మా యంటి చెట్టు ద్వారానే దర్శించాను
గోడల మధ్య పుట్టి
గోడల మధ్యే పెరిగి
గోడలే లోకం అనుకునే నాకు
అరణ్యం ఒక ప్రాకృతిక మాన్యం

అడవిలో మన దారుల్ని
మనమే తీసుకోవాలి
చెట్టుకొమ్మల్లోంచి ఆకాశం
కాస్త కాస్త రాలి పడుతుంది

నెమలికి కాలు విరిగినట్టుంది
అదివ్వాళ ఆడదు
కోకిల స్వరపేటిక దెబ్బతిన్నది
అదిప్పుడు పాడదు
అడవి భయపెడుతుందా!
అరణ్యపుత్రులనడగాలి.
అడవి సుందరోజ్వల తరు శిరోజాలతో
స్నానమాడుతుందా!
ఇటువైపొచ్చిన వర్షాన్ని ప్రశ్నించాలి

అడవిని చూడకున్నా
చూసినట్టే వుంటుంది
ఇన్నాళ్లూ అడవిని చూడకుండానే
కవిత్వం రాస్తున్నాను
బహుశా అది ఇన్నాళ్లూ
నాలోనే వుండి వుండాలి

--డా.ఎన్.గోపి