Others

డబ్బంతా.. డబ్బింగ్ సినిమాలదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా విశ్వవ్యాప్త కళాత్మక వ్యాపారం. అందుకే రీమేక్, డబ్బింగ్ ప్రక్రియల ద్వారా అన్ని ప్రాంతాల ప్రజలనూ టచ్ చేస్తూంటుంది. ప్రాంతీయ భాషా చిత్రాలు ఆయా ప్రాంతాలకే పరిమితం అవుతుంటే, హాలీవుడ్ సినిమా మాత్రం ప్రపంచాన్ని చుట్టిముట్టేస్తూ వేల కోట్లు కొల్లగొడుతోంది. ఇటీవలి కాలంలో లోకల్ హీరోల సినిమాలకు ధీటుగా రిలీజ్ అవుతూ, పెద్ద హీరోలకూ చుక్కలు చూపిస్తున్నాయి. స్టార్ హీరోల సినిమా రిలీజ్ డేట్‌కి అటో ఇటో వారం తేడాలో హాలీవుడ్ సినిమాలు విడుదలవుతుండటమే కాదు, క్రమంగా థియేటర్ల సంఖ్యను పెంచుకుంటూ సవాల్ విసురుతున్నాయి.
భారతీయ సినిమా మార్కెట్‌పై హాలీవుడ్ చిత్రాలు ప్రభావం కొత్తకాకున్నా, కొద్దికాలంగా అగ్ర నిర్మాణ సంస్థలూ హాలీవుడ్ చిత్రాలను కొనుగోలుచేసి అనేక భాషల్లోకి గ్రాండ్ రిలీజ్ చేస్తుండటంతో, వీటికి మరింత క్రేజ్ పెరుగుతుంది. యాంగ్రీ బర్డ్స్, జంగిల్‌బుక్, ఎక్స్‌మెన్ వంటి సినిమాలు ఇటీవలి కాలంలో అగ్ర హీరోల సినిమాలకే చుక్కలు చూపించాయి. తెలుగులో పవన్ సర్దార్‌కు జంగిల్‌బుక్, మహేష్ బ్రహ్మోత్సవానికి ఎక్స్‌మెన్ సినిమాలు పెద్ద సవాల్‌గా నిలిచాయి. బాలీవుడ్‌లో క్రేజీ దర్శకుడు వర్మ వీరప్పన్ సినిమాను పప్పెట్ సినిమా ‘యాంగ్రీబర్డ్స్’ దెబ్బకొడితే, హైఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన బాలీవుడ్ బాద్‌షా షారూక్ సినిమా ‘్ఫ్యన్’పై జంగిల్‌బుక్ సక్సెస్‌ని సాధించింది. ఇక చాలాకాలం తర్వాత డీగ్లామర్ రోల్ చేసి ప్రేక్షకుల మెప్పుకోసం ‘సరబ్‌జిత్’తో ఎదురుచూసిన ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ సినిమా కంటే ‘ఎక్స్‌మెన్’ బెటర్ అని ప్రేక్షకులు తేల్చేయడం గమనార్హం. తాజాగా త్రివిక్రమ్ క్రేజీ సినిమా ‘అఆ’పైనా వారం గ్యాప్‌లో విడుదలైన ‘వార్‌క్రాఫ్ట్’ ప్రభావం చూపించింది.
దేశవ్యాప్తంగా చూస్తే హాలీవుడ్ నుంచి దిగుమతయ్యే సినిమాల సంఖ్య ఏడాదికాలంలో అధికంగానే ఉంటుంది. భారతీయ సినిమాలు కూడా ప్రపంచవ్యాప్తంగా హల్‌చల్ చేస్తున్నా, ఓవర్సీస్‌లో అంతగా ప్రభావం చూపలేక పోతున్నాయి. వీటి సంఖ్య బాలీవుడ్ నుంచి ఎక్కువ కనిపిస్తుంటే, ఓవర్సీస్‌లో ఓకే అనిపించుకున్న ప్రాంతీయ భాషా చిత్రాలను వ్రేళ్ళపై లెక్కపెట్టొచ్చు. టాలీవుడ్‌పరంగా అగ్రహీరోల సినిమాలు బాలీవుడ్‌లోనూ, అప్పుడప్పుడూ హాలీవుడ్‌లో సందడి చేస్తున్నాయి. బాహుబలి మాత్రం ప్రపంచ భాషల్లో ప్రేక్షకులను టచ్‌చేసే దిశగా నడిచినా, టాలీవుడ్‌కి గర్వకారణమైన ఈ సినిమా జపాన్‌లో నిరాశనే మిగిల్చింది.
భారతీయ ఆర్థిక వ్యవస్థలో సినిమా రంగం వాటాను గమనించిన ప్రభుత్వం ఇటీవల ప్రోత్సాహకాలనూ ప్రకటించింది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్స్, ఆస్కార్‌కి నామినేట్ అయ్యే స్థాయిలో చిత్రాలను నిర్మించాలనే లక్ష్యాన్ని దర్శక నిర్మాతల ముందుంచింది. ఈ దిశగా ఆలోచనలు చిత్ర పరిశ్రమలో మొదలైతే భారతీయ సినిమా తీరు, మార్కెటింగ్ సైతం విస్తృతం కానుంది. ప్రమోషన్ విషయంలోనూ ప్రభుత్వం ప్రోత్సాహకాలు కల్పించేందుకు సిద్ధంకావడం భారతీయ సినిమాకు నిజంగా వరమే!
ఇక డబ్బింగ్ చిత్రాల విషయానికొస్తే కన్నడ పరిశ్రమ ‘శాండిల్ వుడ్’ ఒకటే కొన్ని నియమాలను పెట్టుకోవడంవల్ల అక్కడ ఇష్టారాజ్యంగా డబ్బింగ్‌లు పోటీపడలేక పోతున్నాయి. ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే డబ్బింగ్‌లకు థియేటర్లు దొరుకుతాయి. హిందీ, తమిళం, తెలుగు, మలయాళం వంటి భాషల్లో నియమాలు లేకపోవడంవల్ల వందల సంఖ్యలో డబ్బింగ్ చిత్రాలకు థియేటర్లు దొరుకుతున్నాయి. వీటి ప్రభావం స్ట్రెయిట్ సినిమాలపై భారీగానే ఉంటుంది. సర్దార్ గబ్బర్‌సింగ్ వల్ల థియేటర్లు కొరత కారణంగా తక్కువ స్క్రీన్స్ విడుదలైన ‘జంగిల్‌బుక్’, ఆ తర్వాత స్క్రీన్స్‌ని పెంచుకుంది. బ్రహ్మోత్సవం హడావుడితో సాదాసీదాగా విడుదలైన ‘బిచ్చగాడు’ ప్రస్తుతం మల్టీప్లెక్స్‌లను ఆక్రమించేసింది. సూర్య ‘24’, విశాల్ ‘రాయుడు’ ఇలా ఎన్నో సినిమాలు టాలీవుడ్ సొమ్మును కొల్లగొడుతున్నాయి.
టాలీవుడ్‌లో ఏటా 150-180 సినిమాలు విడుదలవుతుంటే, దాదాపు సగభాగం డబ్బింగ్‌లదే హవా! అగ్ర హీరోల సినిమాలు 10కి మించడం లేదు. తెలుగు హీరోలు కూడా ఇతర మార్కెట్‌లపై కన్నువేయడంతో తమిళంలో చాలామంది మంచి విజయాలే సాధిస్తున్నారు. మలయాళంలోనైతే అల్లు అర్జున్‌దే స్టార్‌డమ్. ప్రస్తుతం ఈ మార్కెట్‌పై మోహన్‌లాల్‌తో కలసి జూ.ఎన్టీఆర్ కనే్నశాడు. బాలీవుడ్‌లో తెలుగు హిట్స్ రీమేక్‌లుగా రావడంతోపాటు డబ్బింగ్‌ల జోరుకూడా పెరిగింది. ‘ఈగ’ బాలీవుడ్ మార్కెట్‌తో అవాక్కైన రాజవౌళి, బాహుబలిని మాత్రం కరణ్‌జోహార్ చేతిలో పెట్టి మంచి క్రేజ్ కొట్టాడు. అందుకే బాహుబలి-2కి క్రేజీ ఆఫర్‌లు వస్తున్నా కరణ్‌కే ఓటేస్తున్నాడని వినికిడి.
టెక్నికల్ వాల్యూస్, హయ్యస్ట్ రెమ్యూనరేషన్స్, కాస్ట్ఫా ప్రొడక్షన్ వంటి అనేక కారణాలతో చాలా చిత్ర నిర్మాణ సంస్థలు నిర్మాణానికి దూరమైపోయాయి. వీటన్నింటికి నేడు డబ్బింగ్ ఓ మంచి అవకాశంగా ఉంది. అందుకే వీరు సబ్జెక్ట్‌వున్న సినిమాలతోపాటు సబ్జెక్ట్‌లేని సినిమాలకు సైతం పబ్లిసిటీతో హోరెత్తిస్తున్నారు. కొన్ని సినిమాలకు ఫ్యాన్సీ ఆఫర్లు కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం శంకర్ రోబో-2 ఆ స్థాయిలోనే ఉంది. రాబోయే ‘కబాలి’ కూడా టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌తో ఉంది. శ్రీ తిరుమల తిరుపతి శ్రీనివాసా సంస్థపై అనేక స్ట్రయిట్ సినిమాలు తీసిన చదలవాడ శ్రీనివాసరావు చాలాకాలం తర్వాత ‘బిచ్చగాడు’వంటి డబ్బింగ్ సినిమాతో మంచి హిట్‌నికొట్టి డబ్బింగ్ చిత్రాలపై ఆశను పెంచారు. ఈ కోవలోనే జి.హరి ‘రాయుడు’ సినిమాను డబ్బింగ్‌గా అందించి ఇప్పుడు విశాల్‌తోనే స్ట్రెయిట్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ‘చంద్రముఖి’ తర్వాత వరస హార్రర్ సినిమాలు డబ్బింగ్ రూపంలో నెలకు రెండు ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నాయి. సక్సెస్ మాటెలావున్నా సేఫ్ ప్రాజెక్ట్‌లుగా ఊరటనిస్తున్నాయి. ఏదేమైనా రీమేక్.. డబ్బింగ్‌ల వల్ల దమ్మున్న కథలు పలు భాషల్లో ప్రేక్షకులను అలరించడం సంతోషమే కదా! బెంగాలీలో శరత్ రాసిన నవల ఆధారంగా నిర్మితమైన ‘దేవదాసు’ చిత్రం ఇప్పటికీ అన్ని భాషలు కలిపి 15కి పైగా సినిమాలుగా రావడం రీమేక్ స్టామినా కథకు నిదర్శనంగా కనిపిస్తుంది. కథలో పట్టుంటే డబ్బింగ్ డబ్బుల మూట అందించడం ఖాయం.

-బాసు