Others

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రీకులో ‘ఎస్క్రులిన్’ అనే దేవత వున్నాడు. ఆయన చేతిలో పాము చుట్టబడిన కర్ర ఒకటి ఉంటుంది. ‘దాహూమా’లో స్వర్ణదేవతకు ‘దాంతిగ్లోయ్’ అని పేరు. బుద్ధ విగ్రహాల వెనుక పాము పడగ పట్టినట్లు చెక్కిన శిల్పాలు కొన్ని వున్నాయి.
ఇన్ని రకాలుగా ఇన్ని మతాలలో ఇన్ని దేశాలలో వున్న నాగపూజ వెనుకాల కొన్ని వైజ్ఞానిక సత్యాలు కూడా వున్నాయి. మానసిక శాస్త్రం ప్రకారం నాగుపాము పురుష జననేంద్రియానికి సంకేతం. పామును చూచినపుడల్లా మనస్సుపై ఒక విధమైన ప్రకంపనలు ప్రవహిస్తాయి. మనస్సు యొక్క స్థూలాకారమే మెదడు. ఈ మెదడు తలలో పాము పడగ ఆకారంలో వుంది. దేహంలో వన్న నరాలన్నీ ఇక్కడినుంచి బయలుదేరి ఒక కుచ్చులాగా మెడ భాగంలో నుంచి వెనె్నముక వైపు దిగుతాయి. ఈ మొత్తం ఒక పాము ఆకారంగా వుంటుంది. మానసిక శాస్త్రం ప్రకారం ఈ భాగాన్ని ఉద్రేకింపజేసి సంతానం పొందటానికి మనసును కేంద్రీకరిస్తే అందుకు సంబంధించిన నరాలపై అనుకూల ప్రభావం పడుతుంది. ఈ విజ్ఞాన సత్యాన్ని ఆధారం చేసుకొనే మన దేశంలో నాగ ప్రతిష్ఠ, సజీవ నాగార్జన అనే రెండు పద్ధతులు ఏర్పడ్డాయి.
ఇక జ్యోతిష్య రీత్యా రాహువు సర్పానికి సంకేతం. గ్రహ మంత్రాలలో రాహువుకి సర్పమే అధిదేవత. అందుచేత రాహు దోష సందర్భాలలో ‘సర్పశాపము’ ఉన్నట్లు భావించి సర్ప పూజాదులు ద్వారా శాంతి చేసుకోమని జ్యోతిష శాస్త్రం ఆదేశిస్తోంది. ఈ సర్ప దోషం ఎక్కువగా సంతానానికి ప్రతిబంధకంగా వుంటుంది. దీనికిగల వైజ్ఞానిక కారణాన్ని మనం ఇందాకనే చర్చించుకున్నాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం రాహు దోష రూపమైన నాగదోషానికి నాగ ప్రతిష్ఠ, నాగపూజ, కొన్ని దానాలు మొదలైనవి విధించారు.
ఈ కారణాలను బట్టి పిల్లలు కలవారు, లేనివారు అందరూ కూడా నాగుచవితినాడో, నాగ పంచమినాడో, సుబ్బరాయుడు షష్ఠినాడో, ఏదో ఒక రోజున ఏదో ఒక రూపంలో నాగపూజ చేయటం సాంప్రదాయంగా వచ్చింది. ఆంధ్ర దేశంలో కార్తీకమాసంలో వచ్చే ‘నాగులచవితి’కి ఎక్కువ ప్రచారం లభించింది. ప్రత్యక్ష నాగపూజ చేయటమే ఈనాటి కర్తవ్యం. దీనికి ప్రత్యామ్నాయంగానే పుట్టలకు పూజ చేసే సంప్రదాయం ఏర్పడింది. పూజలో భాగంగా ‘పుట్టకళ్లు’ సమర్పించటం వంటి సంప్రదాయాలు స్థానికంగా ఏర్పడ్డాయి.
ఎవరు తినే ఆహారం వారి దేవతలకు నైవేద్యం పెట్టుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయమే. అందుకనే ఆ రోజున పుట్టలకు పాలు పోయటం, గ్రుడ్లు సమర్పించటం వంటి వివిధ మార్గాలు ఏర్పడ్డాయి.
జపము-తపము
ఒకే విషయాన్ని మళ్ళీమళ్ళీ భావన చేయడాన్ని ‘జపం’అని చెప్పుకోవచ్చు. బీజాక్షరాలతో కూడుకున్నది ‘మంత్రం’. ఈ మంత్రాన్ని రిథమేటిక్‌గా జపం చేస్తే సైకలాజికల్ ఎఫెక్టు వస్తుంది; సౌండ్ ఎఫెక్ట్ వస్తుంది. మన మెదడులో కాన్షస్, అన్‌కాన్షస్- అని రెండు భాగాలున్నాయి. ‘అన్‌కాన్షస్’ భాగమే మెదడులో ఎక్కువగా వుంటుంది. జపం వలన జనించే సౌండ్ ఎఫెక్టు అన్‌కాన్షస్ భాగంపై పనిచేస్తుంది; మెదడులో వుండే బ్రెయిన్ నెర్వ్స్‌ని స్మూత్ చేస్తుంది.
ఈ సైకలాజికల్ ఎఫెక్టు అనేది బ్రెయిన్‌లోని కాన్షస్ పార్ట్‌మీద పనిచేస్తుంది. ఈ సైకలాజికల్ ఎఫెక్టు, సౌండ్ ఎఫెక్టు మధ్య సమన్వయం కుదిరితే కాన్‌సన్‌ట్రేషన్ అనేది నేచురల్ కాన్‌సిక్వెన్స్‌గా పనిచేస్తుంది. మంత్ర జపం లక్ష్యం ఇదే!
హైపర్ టెన్షన్, ఎరోటిక్ థింకింగ్ అనేవి క్రమక్రమంగా తొలగిపోతాయి. ఇది మంత్ర జపానికి వున్న సైడ్ ఎఫెక్ట్స్.
ఒక్కొక్క బీజాక్షరం శరీరంలోని కొన్ని నరాలను ఉద్దీపింపచేసి రక్త ప్రసారాన్ని క్రమబద్ధం చేస్తుంది.
నాభినుంచి వెలువడే ఓంకార నాద రాగాలాపన ఉచ్ఛ్వాస నిశ్వాసంతో రిథమేటిక్‌గా సాగుతుంది. ఉదాహరణకు- ఓం, ఐం, హ్రీం, శ్రీం, క్లీం.
ఇలాంటి బీజాక్షరాల పలుకుబడిలో నిబద్ధత వుంది; రిథమేటిక్‌గా పలికితే గుండె ఊపిరితిత్తుల పనితీరు క్రమబద్ధవౌతుంది.
జపతపాలకి సమయాసమయాలు నిర్ణయించడంలో ఔచిత్యముంది. స్నానానికి - జపానికి- భోజనానికి- నిద్దరకు కొన్ని సమయాలు కేటాయించారు. మెడికల్‌గాకూడా వాటికి ప్రాముఖ్యం ఉంది. జపం చేసేవారి ముఖం తేజోవంతంగా కనిపిస్తుంది. జపంవలన కొంత శక్తి వస్తుందని ఆధ్యాత్మికంగా చెబుతారు.
సైకలాజికల్ ఎఫెక్టు, సౌండ్ ఎఫెక్టు అని పైన పేర్కొన్నారు. మెడికల్‌గా ఆలోచిస్తే - రక్తప్రసరణ, జీర్ణశక్తి, ఊపిరితిత్తుల పనితీరు సక్రమంగా వుంటే శరీరం కాంతివంతంగా వుంటుంది గదా!
జపంయొక్క ప్రాథమిక స్థాయిలో ఉపయోగించే సాధనం జపమాల, పరుగులు తీయడం మనసు స్వభావం. దీనిని నిలపడానికి సాధకుడు ప్రయత్నిస్తుంటాడు. ఈ ప్రయత్నం కుస్తీపట్టులా ఉండరాదు. - మృదువుగా వుండాలి.
మానవ శరీరంలో ‘వ్రేళ్ళు’అనేవి టి.వి.అంటేనా వంటివి. శరీరంలో సహజసిద్ధంగా ఉద్భవించే కరెంటు ప్రవాహప్రభావం వ్రేళ్ళ చివర్లమీద తీవ్రంగా వుంటుంది. అందుచేత వ్రేళ్ళ కదలికలు మనసును ప్రభావితం చేస్తాయి.
సంగీత విద్వాంసులు, ఉపన్యాసకుల వ్రేళ్ళు చూస్తే మనసుకి వ్రేళ్ళకు వున్న సంబంధం మనకు అర్థవౌతుంది.
*
ఇంకావుంది...
*
‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.
*
ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004. ఆం.ప్ర. 0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి