Others

చల్లని వెనె్నలలో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చివురు వెచ్చని వెనె్నల
నవమి గడచి
మెత్త తెలిరేకు నొత్తిన
మెలపులోన
తగులమెంతయు సాగెడు
తావి బఱపి
సన్న సంపంగి నవ్వెను
చాటు నుండి...

నీలి కాసార గగనంపు
నీళులందు
చుక్కలను బోలు కల్వల
లెక్కలేదు
విచ్చుకొన్నవి తారకల్
విభ్రమమున
పుడమికిన్ స్వర్గమునకొక్క
ముడి రచించి...

తరళ నైశిత్యమున తళ
త్తళల నీను
శీతల మనోహరాంగ సు
న్నిగ్ధమూర్తి
శిల్ప నైపుణీనిస్తుల
కల్పనమ్ము
ప్రణయనీ ప్రసూనాంగ సం
స్పర్శ తగిలె...

జీవ చైతన్య పరిధిలో
చిరుత చిరుత
కదలికలు సాగి దిగబ్రాకి
పొదలి పొదలి
చిత్త విభ్రాంతి చెదరియు
చెదరనట్లు
వెలసె నిదమిథ్థమనరాని
వికసనంబు...

కలువ రేకుల మీది కలవాక వంపుగా
విన్నులో దిద్దిన వనె్న చాలు
పైడి పుప్పొడి జల్లు పెద్ద పువ్వుకునైన
సహజవౌ చల్లని సామరథ్య
సంపంగి ముఖరాగ సంపదనలరించు
సౌగంధికావృత సరసపదము
తళుకొత్తు మినే్నటి తరగల మెత్తపై
పాటించి కూర్చిన పట్టుపరుపు
అమృత తీర్థంబున గ్రుంకు లాడియాడి
మృదు కరస్పర్శవోలె మోహపరచి
మధుర సీమంతి నీ చారు మందహాస
వాసనలు చిమ్ము వెనె్నలై వచ్చెనదివొ...!

- సాంధ్యశ్రీ, 8106897404