Others

వెండిని మెరిపిద్దామా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి ఫ్యాషన్ ప్రపంచంలో అమ్మాయిలు బంగారానికంటే వెండి, ఇత్తడికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఎందుకంటే సీజన్ ఏదైనా స్టైలిష్‌గా, ట్రెండీగా, అందంగా కనిపిస్తారు అమ్మాయిలు ఈ నగలతో.. అందుకే ఫ్యాషన్ డిజైనర్లు కూడా వెండితోనే ట్రెండీ నగలను తయారుచేస్తున్నారు. అయితే ఈ వెండి నగలు ఎక్కువకాలం మన్నాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే కొద్దికాలానికే అవి మెరుపును కోల్పోతాయని చెబుతున్నారు ఫ్యాషన్ నిపుణులు. అవేంటో చూద్దాం..
* వర్షాకాలంలో వెండి నగల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వర్షానికి తడిసిన నగలను ఇంటికి వచ్చిన వెంటనే పొడిగా ఆరబెట్టుకోవాలి. వర్షాకాలంలో గాల్లో తేమ అధికంగా ఉంటుంది. వెండి వంటి మెత్తని లోహాలు గాలిలోని తేమను పీల్చుకుని త్వరగా నల్లబడిపోతాయి. కాబట్టి వర్షాకాలంలో వెండి నగల విషయంలో జాగ్రత్త తప్పనిసరి.
* ఇంటి పనులు చేసేటప్పుడు, స్విమ్మింగ్ చేసేటప్పుడు వెండి నగలను ధరించకూడదు.
* పూర్తిగా తయారైన తర్వాత అంటే పర్‌ఫ్యూం కూడా వేసుకున్న తర్వాత మాత్రమే వెండి నగలను ధరించాలి. లేకపోతే పర్‌ఫ్యూం, రూం ఫ్రెష్‌నర్స్‌లోని సల్ఫర్ కారణంగా వెండి, మెరుపును కోల్పోతుంది.
* వెండి నగలను శుభ్రం చేయడానికి మార్కెట్లో దొరికే కమర్షియల్ సిల్వర్ క్లీనర్లను ఉపయోగించకూడదు. ఎందుకంటే వీటివల్ల శుభ్రపడటం మాట అటుంచి ఇందులోని రసాయనాలు నగల మన్నికపై ప్రభావాన్ని చూపిస్తాయి.
* అంతేకాకుండా ఈ లిక్విడ్ క్లీనర్లను నేరుగా ఉపయోగించడం వల్ల ఇవి ఇరుకైన ప్రదేశాల్లోకి చేరి అలాగే ఉండిపోవడం వల్ల నగ దెబ్బతింటుంది. కాబట్టి లిక్విడ్ క్లీనర్లను నేరుగా ఉపయోగించకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఉపయోగించినా ఇరుకైన ప్రదేశాలతో సహా పూర్తిగా తడి పోయేంతవరకు తుడవాలి.
* వెండి నగలను, వస్తువులను శుభ్రం చేయడానికి వీలైనంతవరకు ఇంట్లో లభించే వస్తువులనే వాడటం మంచిది.
* అరకప్పు నిమ్మరసంలో ఒక చెంచా ఆలివ్ ఆయిల్‌ను వేసి బాగా కలపాలి. మెత్తని వస్త్రాన్ని తీసుకుని ఈ మిశ్రమంలో ముంచి వెండి వస్తువులను శుభ్రం చేయాలి. తరువాత పొడిగుడ్డతో తుడిస్తే అవి మెరుపులీనుతాయి.
* గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా లిక్విడ్ సోప్‌ను కలపాలి. మెత్తని వస్త్రాన్ని ఈ నీళ్లలో ముంచి వెండి నగలను శుభ్రం చేయాలి. తరువాత పొడి గుడ్డతో తుడిస్తే నగలు మెరుస్తాయి.
* కుంకుడు రసాన్ని వేడిచేసి అందులో వెండి నగలను ఐదు నిముషాలపాటు ఉంచాలి. తరువాత బ్రష్‌తో కానీ, మెత్తటి గుడ్డతో కానీ తుడవడం వల్ల నగలు కాంతులీనుతాయి.
* ఈ నగలని వాడిన తరువాత లోపల పెట్టబోయేముందు కాటన్‌తో లేదా శుభ్రమైన నూలు వస్త్రంతో తుడిచి జాగ్రత్త చేస్తే ఎక్కువకాలం మన్నుతాయి.
* సిల్వర్ నగలు ఎప్పుడూ మెరుస్తూ ఉండాలంటే వాడిన తరువాత వాటిని శుభ్రమైన గుడ్డతో తుడిచి దూదిలో చుట్టి గాలి తగలని, పొడిగా ఉండే ప్రదేశంలో వాటిని భద్రపరచాలి. అలాగే బంగారం, ఇత్తడి వంటి ఇతర లోహాలతో చేసిన నగలతో కలిపి వెండి నగలను పెట్టకూడదు. వీటిని మాత్రమే ప్రత్యేకంగా వేరే డబ్బాలో వేసి పెట్టాలి.
* ఈ నగలను భద్రపరిచే ప్రదేశం మరింత పొడిగా ఉండేందుకు దానిలో చాక్‌పీసులను కానీ, సిలికాజెల్‌ను కానీ ఉంచితే సరి.
* జిప్‌లాక్స్‌లో సిల్వర్ నగలను ఉంచితే అవి ఎక్కువకాలం మెరుపును కోల్పోకుండా ఉంటాయి. దీనిలో దూదికానీ, కాటన్ వస్త్రంలో కానీ నగలను ఉంచితే ఎప్పుడూ కొత్తవాటిలా ఉంటాయి.