Others

మరో మల్టీస్టారర్‌లో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో ఎప్పుడూ లేని విధంగా, ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా మల్టీ స్టారర్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. వెంకటేష్, నాగార్జున, రాజశేఖర్, శ్రీకాంత్ లాంటి సీనియర్ హీరోలు యంగ్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే సీనియర్ హీరోలతోపాటు చరణ్ అండ్ ఎన్టీఆర్ లాంటి బడా స్టార్‌లు కూడా కలిసి నటిస్తుండటం విశేషం. ఇప్పటికే వీరి కాంబినేషన్‌కి రాజవౌళి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ చిత్రాల్లో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు విక్టరీ వెంకటేష్. ఇప్పటికే వరుణ్‌తేజ్‌తో ఎఫ్2 సినిమాలో నటిస్తున్నాడు. ఇక మేనల్లుడు నాగచైతన్యతో కూడా ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్న వెంకీ, తదుపరి మరో మల్టీస్టారర్ కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మలయాళం నటుడు దుల్కర్‌సల్మాన్‌తో నటించడానికి వెంకీ ఒప్పుకున్నట్లు టాక్. మహానటి సినిమాలో జెమినీ గణేషన్‌గా కనిపించిన దుల్కర్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. త్వరలోనే వెంకీతో ఓ కొత్త ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఈ హీరో సిద్ధమవుతున్నట్లు సమాచారం.